Bhole Shavali: ‘అత్తగారు పెట్టిన కొత్త వాచీ’.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న భోలే కొత్త సాంగ్‌.. మీరూ చూశారా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టిన భోలే తక్కువ సమయంలో చాలామందికి ఫేవరెట్‌ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. హౌస్ లో తన జర్నీ తక్కువే అయినప్పటికీ తన ఆటతీరు, మాటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. పాటలు, మాటలు, కామెడీతో బిగ్‌ బాస్‌ ఆడియెన్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ అందించాడు భోలే.

Bhole Shavali: ‘అత్తగారు పెట్టిన కొత్త వాచీ'.. యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న భోలే కొత్త సాంగ్‌.. మీరూ చూశారా?
Bhole Shavali, Shubhasri
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2024 | 9:36 PM

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు భోలే షావలి. అంతకు ముందు పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా, లిరిక్‌ రైటర్‌గా రాని గుర్తింపు ఒక్క బిగ్‌ బాస్‌ షో తోనే సొంతం చేసుకున్నాడీ పాట బిడ్డ. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టిన భోలే తక్కువ సమయంలో చాలామందికి ఫేవరెట్‌ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. హౌస్ లో తన జర్నీ తక్కువే అయినప్పటికీ తన ఆటతీరు, మాటతీరుతో అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. పాటలు, మాటలు, కామెడీతో బిగ్‌ బాస్‌ ఆడియెన్స్‌కు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ అందించాడు భోలే. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వార్తల్లోనూ నిలుస్తున్నాడు పాట బిడ్డ. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ తర్వాత జరిగిన పరిణామల్లో పాట బిడ్డ పేరు బాగా వినిపించింది. ప్రశాంత్‌కు బెయిల్‌ రప్పించడంలో భోలే కీలక పాత్ర పోషించాడు. దీంతో రియల్‌ హీరోగా మరోసారి అందరి మనసులు గెల్చుకున్నాడీ పాట బిడ్డ. ఈ సంగతి పక్కన పెడితే గతంలో భోలే ఆలపించిన ఎన్నో ఫోక్‌ ఆల్బమ్స్ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. యూట్యూబ్లో రికార్డులు కొల్లగొట్టాయి. బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత భోలే రిలీజ్‌ చేసిన ‘పాలమ్మిన.. పూలమ్మిన’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ఇప్పటికీ హల్‌ చల్‌ చేస్తోంది. ఇదిలా ఉండగానే తన అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ నుంచి మరో కొత్త ఆల్బమ్‌ను రిలీజ్‌ చేశాడీ పాట బిడ్డ.

‘అత్తగారు పెట్టిన కొత్త వాచీ లెక్క’ అని లిరిక్స్‌తో సాంగే భోలే ఫోక్‌ సాంగ్‌ ఇప్పుడు సంగీత ప్రియులన బాగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో భోలే, బిగ్‌ బాస్‌ బ్యూటీ శుభ శ్రీ రాయగురుతో స్టెప్పులేయడం విశేషం. ఈ ఫోక్‌ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌, లిరిక్‌ రైటర్‌, సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా భోలేనే వ్యవహరించడం విశేషం. యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన భోలే సాంగ్‌ ఇప్పటివరకు 1.1 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకంఉది. తాజగా తన పాటకు వస్తోన్న స్పందనను చూసి సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టాడు పాట బిడ్డ. ‘మీరు కూడా అత్త గారి కొత్త వాచి లెక్క’ పాటకి రీల్ చేయండి. దీనికి నన్ను ట్యాగ్‌ చేయండి. మంచి వీడియోకి ఒక అద్భుతమైన గిఫ్ట్‌ ఇస్తా’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు భోలే. మరి మీరు కూడా భోలే పాటకి రీల్స్‌ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అంతకన్నా ముందు పాట బిడ్డ కొత్త సాంగ్‌ను చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మంచి రీల్స్‌ చేస్తే బహుమతి ఇస్తా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.