Mad Movie: థియేటర్లు, ఓటీటీలో సూపర్ హిట్.. ఇప్పుడు టీవీలో ‘మ్యాడ్’.. టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?
అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు. బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొట్టింది. నవంబర్ 3 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న మ్యాడ్ జవాన్ సినిమాలను అధిగమించి మరీ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది.
గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సూపర్‌హిట్‌గా నిలచిన చిత్రాల్లో మ్యాడ్ ఒకటి. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీతో ఎన్టీఆర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమయ్యాడు. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు. బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోనూ అదరగొట్టింది. నవంబర్ 3 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న మ్యాడ్ జవాన్ సినిమాలను అధిగమించి మరీ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లు, ఓటీటీలో అదరగొట్టిన మ్యాడ్ మూవీ ఇప్పుడు టీవీ ఆడియెన్స్‌కు నవ్వులు పంచేందుకు వస్తోంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కచ్చితమైన తేదీపై ఇంకా సమాచారం లేదు కానీ త్వరలోనే టీవీ తెరపై మ్యాడ్ సినిమా టెలికాస్ట్ కానుందని సమాచారం. బహుశా సంక్రాంతికి లేదా జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి మ్యాడ్ సినిమా టీవీలో ప్రసారం కావొచ్చని వార్తలు వస్తున్నాయి.
కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన మ్యాడ్ సినిమాలో రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు, ఆంటోని, శ్రీకాంత్ రెడ్డి తదితరలు ప్రధాన పాత్రల్లో మెరిశాడు. ప్రముఖ దర్శకుడు, జాతి రత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ కూడా ఓ క్యామియో రోల్‌లో సందడి చేశాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, హారిక సూర్యదేవర సంయుక్తంగా మ్యాడ్ సినిమాను నిర్మించారు. ధమాకా, బలగం వంటి సినిమాలకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరిలియో మ్యాడ్ సినిమాకు అదిరిపోయే పాటలు సమకూర్చారు. మరి థియేటర్లు, ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన మ్యాడ్ బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.
Vibe to this single anthem song #ProudSeSingle from the movie #MAD
🎶 https://t.co/TKf3j0wcP5#WednesdayVibes @NarneNithiin #SangeethShobhan #RamNitin #GouriPriyaReddy #AnanthikaSanilkumar #GopikaUdayan @AzizNakash #BheemsCeciroleo #Raghuram @adityamusic pic.twitter.com/9uyz3nSTm4
— Aditya Music (@adityamusic) January 3, 2024
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj
— Netflix India South (@Netflix_INSouth) October 30, 2023
మ్యాడ్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..