Bigg Boss OTT 2: ఎంటర్‌టైన్మెంట్ డబుల్ డోస్.. బిగ్ బాస్‌లో మళ్లీ భోలే, నయని పావని.. ఓటీటీ సీజన్ 2 ఎప్పుడంటే?
గతేడాది లాగానే ఈసారి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారట. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం వేట కొనసాగిస్తున్నారట. ఏడో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి ఒక వారంలోనే ఎలిమినేట్ అయిన నయని పావనీని మళ్లీ బిగ్ బాస్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ ఏడో సీజన్ ముగిసింది. సుమారు వంద రోజులకు పైగా సాగిన ఈ సెలబ్రిటీ గేమ్‌షో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్మెంట్ అందించిన బిగ్ బాస్ షో ముగియడంతో చాలా మంది నిరాశ చెందారు. మళ్లీ ఎప్పుడెప్పుడు ఈ షో వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి బిగ్ బాస్ యాజమాన్యం ఓ శుభవార్త చెప్పింది. గతేడాది లాగానే ఈసారి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారట. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం వేట కొనసాగిస్తున్నారట. ఏడో సీజన్‌లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చి ఒక వారంలోనే ఎలిమినేట్ అయిన నయని పావనీని మళ్లీ బిగ్ బాస్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హౌజ్‌లో ఉన్న వారం రోజుల్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అని నిరూపించుకుంది నయని పావని. టాప్-5లో నిలుస్తుందని చాలా మంది భావించారు. అయితే ఉన్నట్లుండి వచ్చిన వారంలోపే నయనిని ఎలిమినేట్ చేశారు. దీంతో ఏడ్చుకుంటూ హౌజ్ నుంచి బయటకు వెళ్లిన అందాల తార తనతో పాటు అందరినీ ఏడిపించేసింది. ఇలా అతి తక్కువ కాలంలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న నయనిని ఎలాగైనా మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి.
నయనితో పాటు ప్రముఖ ఫోక్ సింగర్ భోలే షావలి కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లోకి రానున్నాడని టాక్ వినిపిస్తోంది. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తన పాటలు, మాటలతో ఎంటర్‌టైన్మెంట్ అందించాడు పాట బిడ్డ. వీటన్నిటికీ మించి పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ రావడంలో భోలే కీలక పాత్ర పోషించి రియల్ హీరోగా మారిపోయాడు. దీంతో పాట బిడ్డను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వీరితో పాటు ఓటీటీ సీజన్ 2 కోసం ఏకంగా 12 మంది ఫేమస్ యూట్యూబర్లను రంగంలోకి దించుతున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిలో సగం మంది లేడీ యాంకర్లు ఉన్నారట. మార్చిలోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌ను లాంఛ్ చేయవచ్చని తెలుస్తోంది.
నయనితో పాటు ప్రముఖ ఫోక్ సింగర్ భోలే షావలి కూడా..
View this post on Instagram
గ్రాండ్ ఫినాలేలో నయని సందడి..
View this post on Instagram
బిగ్ బాస్ ఫైనలిస్టులతో నయని పావని..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.