Aata Sandeep: ఏంటి బ్రో అలా దొరికిపోయావ్.. హీరోగా బిగ్ బాస్ ఫేమ్ ఆట సందీప్.. పోస్టర్‌పై దారుణంగా ట్రోల్స్
గతంలో కొన్ని సినిమాల్లోనూ నటించాడు సందీప్ మాస్టర్. హీరోగా లవ్ యూ టూ అనే మూవీతోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. సందీప్ సతీమణి జ్యోతి రాజ్‌నే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం విశేషం. అయితే ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ కొరియోగ్రఫీ పైనే దృష్టి సారించాడు. ఇప్పుడు మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడీ డ్యాన్స్ మాస్టర్. తాజాగా ది షార్ట్ కట్ పేరుతో ఒక సినిమాను కూడా పూర్తి చేశాడు
అదిరిపోయే స్టెప్పులు, డ్యాన్సింగ్ మూమెంట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆట సందీప్ అలియాస్ సందీప్ మాస్టర్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన ఈ డ్యాన్స్ మాస్టర్ అప్పటి నుంచే తన పేరును ఆట సందీప్‌గా మార్చుకున్నాడు. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సందీప్ మాస్టర్ బిగ్ బాస్ ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా నిలిచిన ఈ డ్యాన్స్ మాస్టర్ షో ప్రారంభంలో అంచనాలకు తగ్గట్టుగానే బాగానే గేమ్స్, టాస్కులు ఆడాడు. అయితే ఆ తర్వాత మాస్టర్ తేలిపోయాడు. తక్కువ ఓట్లు రావడంతో నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఏడో సీజన్‌లో హౌజ్ నుంచి బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్ సందీప్ మాస్టరే కావడం గమనార్హం. గతంలో కొన్ని సినిమాల్లోనూ నటించాడు సందీప్ మాస్టర్. హీరోగా లవ్ యూ టూ అనే మూవీతోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. సందీప్ సతీమణి జ్యోతి రాజ్‌నే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం విశేషం. అయితే ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ కొరియోగ్రఫీ పైనే దృష్టి సారించాడు. ఇప్పుడు మళ్లీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడీ డ్యాన్స్ మాస్టర్. తాజాగా ది షార్ట్ కట్ పేరుతో ఒక సినిమాను కూడా పూర్తి చేశాడు. విజయానికి అడ్డ దారులుండవు అనేది మూవీ క్యాప్షన్.
ప్రమోషన్లలో భాగంగా ది షార్ట్ కట్ సినిమా కొత్త పోస్టరను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు సందీప్ మాస్టర్. ఇందులో పోస్టర్‌లో రివాల్వర్ పట్టుకుని సీరియస్ మోడ్‌లో కనిపించాడీ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ది షార్ట్ కట్ మూవీ పోస్టర్‌పై ‘బిగ్ బాస్ బెస్ట్ సంచాలక్ ఆట సందీప్.. కేఎస్ ప్రకాశ్ పాత్రలో నటించనున్నట్లు రాసి ఉంది. దీంతో సందీప్ మూవీ పోస్టర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బిగ్ బాస్ బెస్ట్ సంచాలక్ అనేది ఏమైనా ఆస్కార్ అవార్డా? ఇలా పోస్టర్‌లో వేసుకున్నారు’ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇదేంది బ్రో..
Poster bagundi ok
Bb Logo kinda best sanchalak endiraa 😭😭🤣🤣 pic.twitter.com/lNpQxd8LFp
— Betty🌶️ (@BinduFanBettyyy) January 2, 2024
ది షార్ట్ కట్ మూవీ కొత్త పోస్టర్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..