AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hi Nanna OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాని సూపర్‌ హిట్‌ సినిమా.. ‘హాయ్‌ నాన్న’ ఎక్కడ చూడొచ్చంటే?

తండ్రీ కూతుళ్ల అనుబంధానికి, అందమైన ప్రేమకథను జోడించి శౌర్యువ్‌ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జెర్సీ తర్వాత తండ్రి పాత్రలో మరోసారి ఒదిగిపోయాడు హీరో నాని. అలాగే మృణాళ్‌ అందం, అభినయం అందరినీ కట్టిపడేసింది. ఇక నాని కూతురు మహీ పాత్రలో బేబి కియారా ఖన్నా నటన కన్నీళ్లు తెప్పించింది.

Hi Nanna OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నాని సూపర్‌ హిట్‌ సినిమా.. 'హాయ్‌ నాన్న' ఎక్కడ చూడొచ్చంటే?
Hi Nanna Movie
Basha Shek
|

Updated on: Jan 03, 2024 | 8:52 PM

Share

దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత న్యాచురల్ స్టార్‌ నాని నటించిన చిత్రం హాయ్‌ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో సీతారామం బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. డిసెంబర్‌ 7న థియేటర్లలో విడుదలైన హాయ్‌ నాన్న సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి, అందమైన ప్రేమకథను జోడించి శౌర్యువ్‌ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జెర్సీ తర్వాత తండ్రి పాత్రలో మరోసారి ఒదిగిపోయాడు హీరో నాని. అలాగే మృణాళ్‌ అందం, అభినయం అందరినీ కట్టిపడేసింది. ఇక నాని కూతురు మహీ పాత్రలో బేబి కియారా ఖన్నా నటన కన్నీళ్లు తెప్పించింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు సగటు సినీ ప్రేమికులు హాయ్‌ నాన్న సినిమాకు ఫిదా అయ్యారు. థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పించిన నాని సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. హాయ్ నాన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గురువారం (డిసెంబర్‌ 4) నుంచే నాని సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ఇవాళ అర్ధ రాత్రి నుంచే హాయ్‌ నాన్న సినిమా ఓటీటీలోకి రానుంది.

తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోకి అందుబాటులోకి రానుంది హాయ్‌ నాన్న. వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌ రెడ్డి హాయ్‌ నాన్న సినిమాను నిర్మించారు. ఖుషి మూవీ ఫేమ్‌ హేషమ్ అబ్దుల్ వాహబ్ నాని సినిమాకు సంగీతం అందించారు. కోలీవుడ్‌ నటుడు జయరాం, సీనియర్ నటి మీరా జాస్మిన్‌, బాలీవుడ్ నటుడు అంగద్‌ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో నాని సినిమాను మిస్‌ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇవాళ అర్ధరాత్రి నుంచే నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్..

హాయ్ నాన్న సినిమా ట్రైలర్..

హాయ్ నాన్న సినిమాలో మృణాళ్ ఠాకూర్..

డిసెంబర్ ఏడో తేదీన గ్రాండ్ రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్