Pavala Syamala: దీన స్థితిలో పావలా శ్యామల.. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆర్థిక సహాయం అందజేసిన కాదంబరి కిరణ్‌

ప్రముఖ తెలుగు నటి పావలా శ్యామల ఇప్పుడు దీన పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు కమెడియన్‌గా, స్పెషల్‌ రోల్స్‌తో చేతి నిండా సినిమాలతో బిజీ లైఫ్‌ను గడిపిన ఆమె ఇప్పుడు ఒక వృద్ధాశ్రమంలో కాలం వెల్లదీస్తు్న్నారు. ఆమె వయసు పైబడడంతో పాటు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీనికి తోడు తన కూతురి ఆరోగ్యం దెబ్బతినడం శ్యామలను బాగా కుంగదీసింది.

Pavala Syamala: దీన స్థితిలో పావలా శ్యామల.. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆర్థిక సహాయం అందజేసిన కాదంబరి కిరణ్‌
Kadambari Kiran, Pavala Syamala
Follow us

|

Updated on: Jan 04, 2024 | 7:59 PM

ప్రముఖ తెలుగు నటి పావలా శ్యామల ఇప్పుడు దీన పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు కమెడియన్‌గా, స్పెషల్‌ రోల్స్‌తో చేతి నిండా సినిమాలతో బిజీ లైఫ్‌ను గడిపిన ఆమె ఇప్పుడు ఒక వృద్ధాశ్రమంలో కాలం వెల్లదీస్తు్న్నారు. ఆమె వయసు పైబడడంతో పాటు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీనికి తోడు తన కూతురి ఆరోగ్యం దెబ్బతినడం శ్యామలను బాగా కుంగదీసింది. కొందరు ప్రముఖ నటులు శ్యామలకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వార్తలు వస్తు్న్నాయి. తాజాగా నటి దీన పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్‌ ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు. మీడియా ద్వారా శ్యామల పరిస్థితి తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న నటి శ్యామల దగ్గరకు వెళ్లారు. రూ.25వేల చెక్కును ఆమెకు అందజేసి తన పెద్దమనసును చాటుకున్నారు .

నటుడిగానే కాదు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు కాదంబరి కిరణ్‌. మనం సైతం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తరచూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారాయన. గత దశాబ్దం కాలం నుంచి కష్టంలో ఉన్న సినీ పేద కార్మికులకు, పేదలకు ఆయన సహాయం అందిస్తూ వస్తున్నారు. నెల క్రితమే మనం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొందరు పేదలకు ఆర్థిక సహాయం అందజేశారు. నిర్మాతలు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా చెక్కులు పంపిణి చేశారు.

ఇవి కూడా చదవండి

మనం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో..

కాదంబరి కిరణ్ సేవా కార్యక్రమాలు..

పేద కళాకారులకు చేయూత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే