Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Sivaji: పల్లవి ప్రశాంత్‌కు సపోర్టు చేయడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పేసిన శివాజీ

బిగ్‌ బాస్‌ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ ప్రధానంగా రెండు బ్యాచ్‌లుగా విడిపోయింది. శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌లతో స్పై బ్యాచ్‌, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌లతో స్పా గ్రూప్‌ హౌజ్‌ లో ఆధిపత్యానికి ప్రయత్నించాయి. ఈ బ్యాచ్‌ల గొడవల సంగతి పక్కన పెడితే హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌కు అడుగడుగునా అండగా నిలిచాడు శివాజీ.

Bigg Boss Sivaji: పల్లవి ప్రశాంత్‌కు సపోర్టు చేయడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పేసిన శివాజీ
Sivaji, Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2024 | 9:31 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ముగిసింది. సుమారు వంద రోజులకు పైగా సాగిన ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు డిసెంబర్‌ 17తో శుభం కార్డు పడింది. కామన్‌ మ్యాన్‌గా హౌజ్‌ లోకి ఎంటరైన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ కిరీటంతో బయటకు వెళ్లిపోయాడు. సీరియల్‌ నటుడు అమర్‌ దీప్‌ రన్నరప్‌గా నిలవగా, సీనియర్‌ నటుడు శివాజీ మూడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ ప్రధానంగా రెండు బ్యాచ్‌లుగా విడిపోయింది. శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌లతో స్పై బ్యాచ్‌, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌లతో స్పా గ్రూప్‌ హౌజ్‌ లో ఆధిపత్యానికి ప్రయత్నించాయి. ఈ బ్యాచ్‌ల గొడవల సంగతి పక్కన పెడితే హౌజ్‌లో పల్లవి ప్రశాంత్‌కు అడుగడుగునా అండగా నిలిచాడు శివాజీ. అందుకే శివాజీ ఎలిమినేట్‌ అయినప్పుడు భోరుమని ఏడ్చేశాడు రైతు బిడ్డ. అయితే శివాజీ ప్రశాంత్‌కు మద్దతుగా నిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా వీటిపై స్పందించాడు బిగ్‌ బాస్‌ చాణక్య అదే నండి మన శివాజీ. పల్లవి ప్రశాంత్‌కు సపోర్టు చేయడానికి గల కారణాలను అందరితో పంచుకున్నాడు.

‘‘పల్లవి ప్రశాంత్‌ చాలా అమాయకుడు. ఎంతలా అంటే సోషల్‌ మీడియాను ఎలా వినియోగించుకోవాలో కూడా అతనికి తెలియదు. ప్రశాంత్‌కు యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. అయితే వీటి ద్వారా డబ్బులు వస్తాయని ప్రశాంత్‌కు తెలియదు. వాడికి సోషల్ మీడియా మేనేజర్ కూడా లేడు. బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఇంట్లో నుంచి నేనే వాడి సోషల్‌ మీడియా ఛానెల్స్‌ను మానిటైజేషన్‌ చేయించాను. చాలామంది ప్రశాంత్‌కు రెండు ఫేస్‌లు ఉన్నాయంటారు. వాడికి అన్ని తెలివితేటలే ఉంటే తన ఫాలోవర్స్ తో లక్షలు సంపాదించుకునే వాడు. కానీ వాడు ఆ పని చేయలేదు. అసలైన కామన్‌మెన్ అంటే వాడేనని నాకు అనిపించింది. నాకు చాలా హానెస్ట్‌గా కనిపించాడు. అందుకే నేను వాడి పక్కనఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు శివాజీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్..

అసలైన కామన్ మ్యాన్ ప్రశాంతే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
MBBS విద్యార్ధుల మాస్ కాపియింగ్.. అధికారులు నిద్రపోతున్నారా?
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
ఈ ఆటగాళ్ల విధ్వంసంతో..ఐపీఎల్‌ టాపర్స్‌ లిస్టే మారిపోయింది!
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వేటిని దానం చేయాలంటే..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
17 సినిమాలు చేసిన స్టార్ డమ్ సొంతం చేసుకోలేకపోయింది..
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
పించన్ తీసుకునే వయసులో ఈ పాడు పనులేంట్రా ముసలి నక్క
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ 2025 నోటిఫికేషన్‌
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా?లేదా
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
5 వరుస ఓటములకు చెక్.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే
ఈ నటుడి భార్య కూడా చాలా పాపులర్.. ఆ జంట ఇప్పుడు ఎలా ఉన్నారంటే