Hero Yash: యశ్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి ఏకంగా ఆ హీరోయిన్
‘టాక్సిక్’ అనే సినిమాని ప్రకటించాడు యశ్. ఈ సినిమా కోసం ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కొంతమంది టాప్ టెక్నీషియన్లను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు సినిమా నటీనటుల ఎంపికలోనూ అదే స్కీమ్‌ని వాడుతున్నారు. ఈ సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటి ప్రధాన పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది.

కేజీఎఫ్ సినిమా సిరీస్‌తో దేశవ్యాప్తంగా అబిమానులను సొంతం చేసుకొని .. సంచలన విజయాన్ని అందుకున్నాడు యశ్. రీసెంట్ గానే యశ్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ‘టాక్సిక్’ అనే సినిమాని ప్రకటించాడు యశ్. ఈ సినిమా కోసం ఇండియా నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కొంతమంది టాప్ టెక్నీషియన్లను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు సినిమా నటీనటుల ఎంపికలోనూ అదే స్కీమ్‌ని వాడుతున్నారు. ఈ సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటి ప్రధాన పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది.
బాలీవుడ్ నటి రవీనా టాండన్ యశ్ గతంలో బ్లాక్ బస్టర్ మూవీ ‘కెజిఎఫ్ 2’లో ప్రధాన పాత్ర పోషించింది. రమిక సేన్ పాత్రలో ఆమె చేసిన పాత్ర పెద్ద హిట్ అయింది. అదే విధంగా ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా కోసం మరో బాలీవుడ్ స్టార్ నటిని తీసుకొస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ అలియాస్ బెబో ‘టాక్సిక్’ చిత్రంలో యశ్ కు జోడీగా నటిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానప్పటికీ, ఫిల్మ్‌సర్కిల్స్ తో పాటు పలు బాలీవుడ్ వెబ్‌సైట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, ఒక టాక్ షోలో, నటి కరీనా కపూర్ తనకు యశ్ అంటే ఇష్టమని అలాగే అతనితో నటించాలని ఉందని చెప్పింది. ఆ తర్వాత యశ్‌తో కలిసి ‘టాక్సిక్’ చిత్రంలో కరీనా నటిస్తోందని టాక్ మొదలైంది.
‘టాక్సిక్’లో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తుందా లేక సహాయ పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది . ‘టాక్సిక్’ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, సాయి పల్లవి పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి కరీనా ప్రధాన పాత్రలో కాకుండా ప్రధాన సహాయ పాత్రలో నటించే అవకాశం ఉంది. ‘టాక్సిక్’ సినిమా ప్యూర్ యాక్షన్ మూవీ, డ్రగ్స్ నెట్‌వర్క్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు నీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ ఈ సినిమా కోసం విభిన్నమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.