Lingoccha OTT: ఆహాలో పాత బస్తీ కుర్రాడి లవ్ స్టోరీ .. కార్తీక్‌ రత్నం ‘లింగొచ్చా’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్టోబర్‌ 27న థియేటర్లలో రిలీజైన లింగొచ్చా యావరేజ్‌గా నిలిచింది. బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది. అయితే హైదరాబాద్‌ పాత బస్తీ నేపథ్యంలో సాగే ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లింగొచ్చా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ కు సిద్ధమైంది.

Lingoccha OTT: ఆహాలో పాత బస్తీ కుర్రాడి లవ్ స్టోరీ .. కార్తీక్‌ రత్నం ‘లింగొచ్చా’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Lingoccha Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2024 | 9:32 AM

కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు యువ నటుడు కార్తీక్‌ రత్నం. వెంకటేశ్‌ నారప్ప, నితిన్‌ చెక్‌, రౌడీ బాయ్స్‌ తదితర సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌ పోషిస్తూనే సోలో హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. గతేడాది కార్తీక్‌ రత్నం నటించిన ఛాంగురే బంగారు రాజా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అలాగే అతను నటించిన వ్యవస్థ వెబ్ సిరీస్‌కు జీ5 ఓటీటీలో మంచి వ్యూ్స్‌ వచ్చాయి. కార్తీక్‌ రత్నం 2023లో నటించిన మరో డిఫరెంట్‌ సినిమా లింగొచ్చా. సుప్యర్దీ సింగ్ హీరోయిన్‍గా నటించగా, బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్, ఉత్తేజ్ తదితరులు కీలకపాత్రలు చేశారు. అక్టోబర్‌ 27న థియేటర్లలో రిలీజైన లింగొచ్చా యావరేజ్‌గా నిలిచింది. బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది. అయితే హైదరాబాద్‌ పాత బస్తీ నేపథ్యంలో సాగే ఈ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లింగొచ్చా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. తాజాగా లింగొచ్చా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ఆహా. సంక్రాంతి కానుకగా జనవరి 13న కార్తీక్‌ రత్నం సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ట్వీట్‌ చేసింది. .’హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఆట! లింగొచ్చా ఆహాలో వస్తోంది.. పారా హుషార్. ఈ రొమాంటిక్ డ్రామాను జనవరి 13న ఆహాలో చూసి ఆనందించండి’ అని ట్వి్ట్టర్‌లో రాసుకొచ్చింది ఆహా.

ఆనంద్ బడా తెరకెక్కించిన లింగొచ్చా సినిమాలో చాలామంది కొత్త వాళ్లే నటించారు. పటాస్ సద్దామ్, కే నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. యాదగిరి రాజు నిర్మాతగా వ్యవహరించగా బికాజ్ రాజ్ సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌ పాత బస్తీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. శివ (కార్తీక్ రత్నం), ముస్లిం అమ్మాయి నూర్జహాన్ (సుప్యార్ధీ సింగ్) చిన్నప్పటి నుంచే ప్రేమలో ఉంటారు. అయితే నూర్‌ దుబాయి వెళ్లిపోతుంది. తన లవర్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంటాడు శివ. చాలా ఏళ్ల తర్వాత నూర్‌ మళ్లీ ఇండియాకు రావడంతో ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుంది. అయితే నూర్‌ ఇంట్లో ఈ ప్రేమకు అడ్డుచెబుతారు? మరి శివ, నూర్‌ల ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? లేదా అన్నది తెలుసుకోవాలంటే లింగొచ్చా మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్..