Tiger 3 OTT : సల్మాన్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన ఓటీటీ సంస్థ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

భారీ అంచనాల మధ్య విడుదలైన టైగర్ 3 సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే టైగర్ 3 సినిమాకు కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. థియేటర్స్ లో ఈసినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. త్వరలోనే టైగర్ 3 సినిమా ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే దీని పై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

Tiger 3 OTT : సల్మాన్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన ఓటీటీ సంస్థ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
Tiger 3 OTT
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 06, 2024 | 5:01 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టైగర్ మూవీ సిరీస్ కు సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో వచ్చిన టైగర్ మూవీస్ సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో టైగర్ 3 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన టైగర్ 3 సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. అయితే టైగర్ 3 సినిమాకు కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. థియేటర్స్ లో ఈసినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. త్వరలోనే టైగర్ 3 సినిమా ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే దీని పై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.

తాజాగా టైగర్ 3 ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ టైగర్ 3 డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. టైగర్ 3 సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అయితే జనవరి 7 నుంచి టైగర్ 3 సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది.

అయితే దీని పై అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చింది. కానీ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే టైగర్ 3 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అమెజాన్ ప్రైమ్ త్వరలోనే అనౌన్స్ చేయనుందని తెలుస్తోంది. సంక్రాంతి టైం లో టైగర్ 3 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకు టైగర్ 3 రైట్స్ ను సొంతం చేసుకుందట.

సల్మాన్ ఖాన్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.