Extra Ordinary Man: సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి నితిన్, శ్రీలీల సినిమా.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో ఓ రేంజ్ అంచనాలను పెంచేసిన ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ యూట్యూబ్లో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనుకున్నారంతా. కానీ అస్సలు ఊహించని స్థాయిలో ప్రేక్షకులను నిరాశ పరిచింది. కేవలం శ్రీలీల, నితిన్ డ్యాన్స్ మినహా.. సినిమాలో కంటెంట్.. కామెడీ వర్కౌట్ కాలేకపోయాయి.
టాలీవుడ్ హీరో నితిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 8న అడియన్స్ ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో ఓ రేంజ్ అంచనాలను పెంచేసిన ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ యూట్యూబ్లో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనుకున్నారంతా. కానీ అస్సలు ఊహించని స్థాయిలో ప్రేక్షకులను నిరాశ పరిచింది. కేవలం శ్రీలీల, నితిన్ డ్యాన్స్ మినహా.. సినిమాలో కంటెంట్.. కామెడీ వర్కౌట్ కాలేకపోయాయి. దీంతో నెట్టింట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేసింది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ సినిమా థియేటర్లలోకి వచ్చి ఎలాంటి హడావిడి చేయకుండానే సైలెంట్ అయిపోయింది.
నితిన్ నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ సినిమా విడుదలైన సమయంలోనే న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సైతం అడియన్స్ ముందుకు వచ్చింది. తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 13న స్ట్రీమింగ్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఈ విషయం అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. చూడాలి మరీ సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా ? లేదా ? అని.
చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించారు సీనియర్ హీరో రాజశేఖర్. మరోసారి తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇందులో డిఫరెంట్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే సుధేవ్ నాయర్, రావు రమేష్, బ్రహ్మాజీ, అజయ్ హర్షవర్దన్ కీలకపాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.
#ExtraOrdinary Jukebox is here! ♥️https://t.co/1QDFMlp2lT #ExtraOrdinaryManOnDec8th
— nithiin (@actor_nithiin) December 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.