Rathika Rose: ఇదేందయ్యా ఇది..!! బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగుపెట్టనున్న రతికా రోజ్..
బిగ్ బాస్ 7 మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకులను ఎదో రకంగా ఆకట్టుకుంటూనే ఉంది. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా అలానే ఉన్నారు. సీరియల్స్ నుంచి కొందరిని సినిమాల నుంచి కొందరిని తీసుకొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. వీరిలో అందాల భామలు శోభా శెట్టి, శుభశ్రీ , ప్రియాంక , అశ్విని, రతికా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందరికంటే శోభా శెట్టి, రతికా కొంచం ఎక్కువే అని చెప్పాలి.
బిగ్ బాస్ సీజన్స్ అన్నింటికన్నా సీజన్ 7 కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.. టీఆర్ఫీ కూడా అదే రేంజ్‌లో వచ్చింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడం.. అతను విన్ అయినా తర్వాత జరిగిన రచ్చ వీటి కారణంగా బిగ్ బాస్ 7 పేరు గట్టిగానే మారుమ్రోగింది. బిగ్ బాస్ 7 మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకులను ఎదో రకంగా ఆకట్టుకుంటూనే ఉంది. ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా అలానే ఉన్నారు. సీరియల్స్ నుంచి కొందరిని సినిమాల నుంచి కొందరిని తీసుకొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. వీరిలో అందాల భామలు శోభా శెట్టి, శుభశ్రీ , ప్రియాంక , అశ్విని, రతికా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందరికంటే శోభా శెట్టి, రతికా కొంచం ఎక్కువే అని చెప్పాలి. రతికా అయితే ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలోకి కూడా అడుగు పెట్టనుందని టాక్ వినిపిస్తుంది. రతికా రోజ్ ఈ అమ్మడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అయిన కామెడీ షో ద్వారా పరిచయం అయిన రతికా అసలు పేరు ప్రియా.. ఇండస్ట్రీకి వచ్చాక పేరు మార్చుకుంది. చాలా సినిమాల్లో కనిపించి మెప్పించింది ఏ ముద్దుగుమ్మ.
బిగ్ బాస్ 7 లోకి అడుగు పెట్టిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఆమెతో పులిహోర కలపడం. ఆతర్వాత అతనితో గొడవ పెట్టుకోవడం.. చివరకు ప్రశాంత్ ఆమెను అక్క అని పిలవడం.. అబ్బో పెద్ద కథే జరిగింది. అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతిఒక్కరితో రతికా వాదనలు , గొడవలు పెట్టుకుంది. నామినేషన్స్ లో మరింతగా రేచిపోయేది ఈ అమ్మడు. అదృష్టం బాగోక ఫైనలిస్ట్ కాలేదు కానీ అయ్యుంటే మరింత రచ్చ చేసేది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీజన్ 7లో గేమ్ తో పాటు గ్లామర్ తో ఆకట్టుకునే రతికా ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందంటూ ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రతికా హీరోయిన్ గా సినిమా చేస్తుంది. ఆమెకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి