Vijay Deverakonda: బ్లాక్ గుర్రంతో స్టైలీష్ ఫోటోస్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. కెమెరా ఆమె చేతిలో ఉందంటున్న నెటిజన్స్..
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటాడు విజయ్. సొంతంగా రౌడీ బ్రాండ్ దుస్తుల బిజినెస్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ నుంచి ఎప్పటికప్పుడు స్టైలీష్ దుస్తులు ధరించి నిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్లలో ఢిఫరెంట్ అండ్ స్టైలీష్, చరిష్మాతో కనిపిస్తుంటాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది ఖుషి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటాడు విజయ్. సొంతంగా రౌడీ బ్రాండ్ దుస్తుల బిజినెస్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ నుంచి ఎప్పటికప్పుడు స్టైలీష్ దుస్తులు ధరించి నిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్లలో ఢిఫరెంట్ అండ్ స్టైలీష్, చరిష్మాతో కనిపిస్తుంటాడు. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో మరోసారి బ్లాక్ సూట్లో సరికొత్త ఫోటో షేర్ చేశాడు విజయ్. బ్లాక్ గుర్రంతో కలిసి.. బ్లాక్ పొడవాటి కుర్తా, బ్లాక్ ప్యాంట్ ధరించి రాయల్ లుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చాడు విజయ్.
తన సొంత దుస్తుల కంపెనీ రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి పాతకాలపు కారు, గుర్రం పక్కన నిల్చున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. విజయ్ షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి రష్మిక పేరును తీసుకువచ్చారు నెటిజన్స్. విజయ్ ఫోటోస్ రష్మిక తీసిందా ?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. విజయ్ ఫోటోను రష్మిక తీసింది అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. యానిమల్ సినిమా నుంచి రష్మిక GIF షేర్ చేసాడు మరో నెటిజన్. ప్రస్తుతం విజయ్ షేర్ చేసిన ఫోటోలకు మొత్తం రష్మిక గురించి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై వీరిద్దరూ ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. గతంలో బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ షోలో రష్మిక, విజయ్ రూమర్స్ పై నేరుగానే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రష్మిక , విజయ్ ప్రస్తావన తెరపైకి వచ్చింది.
View this post on Instagram
ప్రస్తుతం విజయ్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందులో విజయ్ జోడిగా శ్రీలీల నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.