గతంలోనూ సంక్రాంతి వెంకటేష్‌కు బాగా కలిసొచ్చింది. 35 ఏళ్ళ కెరీర్‌లో పండక్కి 13 సార్లు పండక్కి వచ్చారు వెంకీ. 1988 నుంచే వెంకటేష్ సంక్రాంతి వేట మొదలైంది. తొలిసారి రక్తతిలకంతో వచ్చి హిట్ కొట్టారీయన. ఆ మరుసటి ఏడాది ప్రేమ సినిమాతో వచ్చారు. 1992 సంక్రాంతికి విడుదలైన చంటి వెంకటేష్ కెరీర్‌ను మార్చేసింది. అయితే 1995లో పోకిరి రాజా, 96లో ధర్మచక్రం, 97లో చిన్నబ్బాయి వెంకటేష్‌ను నిరాశ పరిచాయి.