AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీ ధైర్యానికి హ్యాట్సాప్ తల్లి.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారులను బాలిక ఎలా కాపాడింతో చూడండి!

ఒక బాలిక తన ప్రాణాలను లెక్కచేయకుండా లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులను ధైర్యంగా కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. లిఫ్ట్ డోర్‌లు మూసుకుపోతుండగా వాటిని తన చేతులతో ఆపి, చిక్కుకున్న చిన్నారులను చాకచక్యంగా బయటకు తీసుకొచ్చిన బాలిక సాహసాన్ని చూసిన నెటిజన్లు ఆమె దైర్యానికి హ్యాట్సాప్ చెబుతున్నారు.

Viral Video: నీ ధైర్యానికి హ్యాట్సాప్ తల్లి.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారులను బాలిక ఎలా కాపాడింతో చూడండి!
Young Girl Saves Two Children Elevator
Anand T
|

Updated on: Feb 21, 2026 | 5:47 PM

Share

లిఫ్ట్‌లో వెళ్లేప్పుడు అది సడెన్‌గా క్లోజ్ అయిపోతేనే చాలా మంది భయపడిపోతుంటారు. కానీ ఇక్కడో బాలిక మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు ధైర్యంగా ముందుకొచ్చింది. ఎంతో చాకచక్యంగా ఇద్దరి చిన్నారులను లిఫ్ట్‌లోంచి బయటకు తీసింది. చిన్నారిని చేసిన సాహసాన్ని చూసిన అక్కడనున్న జనాలంతా మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఒక లిఫ్ట్‌ దగ్గర బయట ఒక బాలిక, ఒక చిన్నారి నిల్చొని ఉండగా.. లిఫ్ట్ లోపల ఇద్దరు చిన్నారులు ఉన్నారు.వారితో బయట నిల్చొన్ని బాలిక మాట్లాడుతూ ఉంది. ఆ చిన్నారులు ఇద్దరూ లిఫ్ట్‌ నుంచి బయటకు వద్దామనుకునేలోపే ఆ లిఫ్ట్ తలుపులు సడెన్‌గా మూసుకుపోయాయి. అది గమనించిన బాలిక అప్రమత్తమై ఆ డోర్స్ పూర్తిగా క్లోజ్ అవ్వకుండా మధ్యలో నిలబడి తన చెతులతో తలుపులను ఆపడానికి ప్రయత్నిస్తుంది.

అయితే నార్మల్ ఎక్కడైనా లిఫ్ట్‌ డోర్స్‌కు ఏదైనా అడ్డు వస్తే అవి ఓపెన్ అవతాయి. కానీ ఇక్కడ మాత్రం చిన్నారి వాటిని ఆపేందుకు ప్రయత్నించినా అవి ఓపెన్ కాకుండా క్లోజ్ అవ్వడం ప్రారంభించాయి. దీంతో ఆ చిన్నారి రెండు తులపుల మధ్యలో ఇరుక్కుపోయింది. అయినా కూడా ఆ బాలిక ధైర్యం కోల్పోకుండా తలుపులు తెరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇంతనో చిన్నారుల ఏడుపును విన్న స్థానికులు అక్కడికి వచ్చిన బాలికకు సహాయం చేశారు.

వీడియో చూడండి..

దీంతో ఆ బాలిక లిఫ్ట్‌లోకి వెళ్లి లోపల ఉన్న ఇద్దరు చిన్నారులను చాకచక్యంగా బయటకు తీసుకొచ్చింది. దీంతో ఆ చిన్నారులకు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా అవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఈ వీడియో చూసిన జనాలు బాలిక చేసిన సాహసానికి హ్యాట్సాప్ చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us