AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి నీచుడా.. ఆటో ఎక్కిన మహిళతో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. వినలేని మాటలతో..

Mumbai Auto Driver Video: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నమ్ముకుని ప్రయాణించే మహిళలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకావడం సమాజానికి మంచిది కాదు. నిందితుడైన ఆటో డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్ చేసి, కఠిన చట్టాల ద్వారా శిక్షించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారికి సరైన బుద్ధి వస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఓరి నీచుడా.. ఆటో ఎక్కిన మహిళతో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. వినలేని మాటలతో..
Rickshaw Driver Obscene Comments On Women
Venkata Chari
|

Updated on: Jun 08, 2026 | 11:22 AM

Share

Rickshaw Driver Obscene Comments on Woman: ముంబై నగరంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆటో ఎక్కిన ఒక మహిళ పట్ల డ్రైవర్ అత్యంత హేయంగా, అసభ్యకరంగా మాట్లాడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, నెటిజన్లు ఆటో డ్రైవర్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆటో ఎక్కగానే అరాచకం.. భయంతో వణికిపోయిన బాధితురాలు..

మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని పాలకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. ముంబై నగరంలో ఒక మహిళ తన గమ్యస్థానానికి వెళ్లేందుకు సాధారణంగానే ఒక ఆటో ఎక్కింది. అయితే ఆమె కూర్చున్న కొద్దిసేపటికే ఆటో డ్రైవర్ తన వికృత చేష్టలను మొదలుపెట్టాడు. నైతిక విలువలను పూర్తిగా పక్కనబెట్టి, సదరు మహిళతో అత్యంత అసభ్య పదజాలంతో మాట్లాడటం ప్రారంభించాడు.

ఇది కూడా చదవండి: Video: వాటర్ కోసం దిగిన తల్లి.. అప్పుడే కదిలిన రైలు.. బిడ్డ కోసం ప్రాణాలనే లెక్కచేయకుండా..

తన ప్రైవేట్ భాగాల గురించి ప్రస్తావిస్తూ అతడు వాడిన మాటలు వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆటో డ్రైవర్ వికృత మనస్తత్వానికి, అతడి అసభ్య వాగ్వాదానికి ఆ మహిళ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. తీవ్ర భయాందోళనలకు లోనైన ఆమె, క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆటోలోంచి కిందకు దిగిపోయింది.

ధైర్యంగా కెమెరాకు చిక్కించిన మహిళ.. నెట్టింట వైరల్

డ్రైవర్ ప్రవర్తనతో మొదట కంగారుపడినా, ఆ మహిళ ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించింది. నిందితుడి అరాచకాన్ని సమాజం ముందు పెట్టాలనే ఉద్దేశంతో, ఆటో డ్రైవర్ మాట్లాడుతున్న అసభ్య మాటలను తన మొబైల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపిస్తోంది.

@th_anonymouse అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. సదరు డ్రైవర్ మాట్లాడిన అసహ్యకరమైన మాటలను క్యాప్షన్‌లో పేర్కొంటూ.. “ఈ వికృత ఆటో డ్రైవర్‌పై ముంబై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?” అని నెటిజన్లు నేరుగా పోలీసులనే ప్రశ్నిస్తున్నారు.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.. లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్..

ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు ఆటో డ్రైవర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా పేరొందిన ముంబైలోనే ఇలాంటి ఘోరం జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక నెటిజన్ స్పందిస్తూ.. “భారతదేశంలో ముంబై నగరం మహిళల రక్షణకు మారుపేరుగా నిలిచింది, కానీ ఇలాంటి సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Video: బస్టాప్‌లో బ్యాగ్‌తో నిల్చున్న పెద్దాయన.. వెనకాలే ముగ్గురు వ్యక్తులు.. కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా

మరో వినియోగదారుడు.. “ప్రస్తుత రోజుల్లో మహిళలకు ఏ నగరమూ సురక్షితం కాదు” అని కామెంట్ చేశారు.

“సదరు ఆటో డ్రైవర్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయడమే కాకుండా, అతడిని మహారాష్ట్ర సరిహద్దుల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలి” అని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం ప్రకారం, ఈ వైరల్ వీడియో ముంబై పోలీసుల దృష్టికి చేరింది. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించిన పోలీసులు, కేసు నమోదు చేసి తదుపరి విచారణను వేగవంతం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us