AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జోమాటోలో శాండ్‌విచ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆతృతగా తింటుండగా నోటికి తగిలిన వస్తువు.. సీన్ కట్‌చేస్తే

Consumer Protection Act India: డబ్బులు తీసుకుని నాణ్యత లేని, ప్రమాదకరమైన ఆహారాన్ని విక్రయించే హోటళ్ల ముక్కు పిండి వసూలు చేసిన ఈ తీర్పు వినియోగదారుల హక్కులకు అద్దం పడుతోంది. హోటల్ ఎంత పెద్దదైనా, బ్రాండ్ ఎంత పేరున్నదైనా సరే.. కస్టమర్ల ఆరోగ్యం విషయంలో రాజీ పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

జోమాటోలో శాండ్‌విచ్ ఆర్డర్ చేసిన మహిళ.. ఆతృతగా తింటుండగా నోటికి తగిలిన వస్తువు.. సీన్ కట్‌చేస్తే
Mohali Consumer Court
Venkata Chari
|

Updated on: Jun 08, 2026 | 10:57 AM

Share

Metal Found in Sandwich: ఆన్‌లైన్‌లో నోరూరించే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని, ఎంతో ఇష్టంగా తినడం మొదలుపెట్టిన ఆ మహిళకు మొదటి ముక్కలోనే ఊహించని షాక్ తగిలింది. సగం నమిలాక అందులో ఏదో గట్టిగా తగలడంతో తీసి చూస్తే ఇనుప ముక్క బయటపడింది. నిర్లక్ష్యంగా ఆహారాన్ని సరఫరా చేసిన సదరు ప్రముఖ ఫుడ్ ఔట్‌లెట్‌పై కోర్టు సీరియస్ అయింది.

ఆన్‌లైన్ ఆర్డర్.. ఊహించని ప్రమాదం..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన తిహిజ్ శర్మ అనే మహిళ కూడా సరిగ్గా ఇదే పని చేశారు. జోమాటో యాప్ ద్వారా మొహాలీలోని ప్రముఖ సబ్‌వే ఔట్‌లెట్ నుండి ‘ఆలూ ప్యాటీ శాండ్‌విచ్’ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇంటికి రాగానే ఎంతో ఇష్టంగా తినడం ప్రారంభించారు. అయితే, కొద్దిసేపటికే ఆమెకు నోట్లో ఏదో గట్టి పదార్థం తగిలింది. అనుమానంతో బయటకు తీసి చూడగా, ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందులో ఒక చిన్న లోహపు ముక్క (చెవి రింగు కంటే చిన్న పరిమాణంలో ఉన్న ఇనుప వస్తువు) కనిపించింది. ఒకవేళ పొరపాటున దానిని మింగేసి ఉంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: Video: వాటర్ కోసం దిగిన తల్లి.. అప్పుడే కదిలిన రైలు.. బిడ్డ కోసం ప్రాణాలనే లెక్కచేయకుండా..

నిర్లక్ష్య సమాధానం.. కోర్టుకెక్కిన బాధితురాలు..

ఈ భయంకరమైన అనుభవం తర్వాత, బాధితురాలు తక్షణమే సదరు ఫుడ్ ఔట్‌లెట్‌ను ఈమెయిల్స్, ఫోన్ ద్వారా సంప్రదించారు. తమ తప్పును సరిదిద్దుకోవాల్సిందిగా కోరుతూ లీగల్ నోటీసులు కూడా పంపారు. కానీ, సదరు యాజమాన్యం నుంచి ఎలాంటి బాధ్యతాయుతమైన సమాధానం రాలేదు. పైగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తిహిజ్ శర్మ, న్యాయం కోసం మొహాలీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరాన్ని ఆశ్రయించారు. శాండ్‌విచ్‌లో దొరికిన లోహపు ముక్కకు సంబంధించిన ఫొటోలు, బిల్లులు, ఈమెయిల్ సంభాషణలను కోర్టుకు ఆధారాలుగా సమర్పించారు.

యాజమాన్యానికి చుక్కెదురు.. కోర్టు సంచలన తీర్పు..

ఈ కేసు విచారణ సందర్భంగా వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ ఎస్.కె. అగర్వాల్, సభ్యులు పరమ్‌జీత్ కౌర్, లెఫ్టినెంట్ కల్నల్ జస్బీర్ సింగ్ బాత్‌లతో కూడిన బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు నోటీసులు పంపినప్పటికీ ఫుడ్ ఔట్‌లెట్ ప్రతినిధులు ఎవరూ విచారణకు హాజరు కాలేదు. దీనిని ఏకపక్ష (ఎక్స్-పార్టీ) కేసుగా పరిగణించిన కోర్టు, బాధితురాలు సమర్పించిన ఆధారాలు నూటికి నూరు శాతం నిజమని తేల్చింది.

ఇది కూడా చదవండి: Video: బస్టాప్‌లో బ్యాగ్‌తో నిల్చున్న పెద్దాయన.. వెనకాలే ముగ్గురు వ్యక్తులు.. కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా

కస్టమర్లకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన పూర్తి బాధ్యత హోటల్ యాజమాన్యానిదేనని కోర్టు స్పష్టం చేసింది. ఆహారంలో ఇనుప ముక్కలు రావడం తీవ్రమైన సేవా లోపమని, ఇది వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం ముమ్మాటికీ ఉల్లంఘనేనని పేర్కొంది.

భారీ జరిమానా వివరాలు..

వినియోగదారుడి ప్రాణాలతో ఆడుకున్నందుకు గానూ సదరు సబ్‌వే ఔట్‌లెట్‌కు కోర్టు కింది విధంగా జరిమానా విధించింది:

రూ. 35,000 – బాధితురాలికి జరిగిన మానసిక క్షోభ, వేధింపులకు పరిహారంగా చెల్లించాలి.

రూ. 160 – శాండ్‌విచ్ అసలు ధరను 9 శాతం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయాలి.

రూ. 10,000 – పీజీఐ పేద రోగుల సహాయ నిధికి జమ చేయాలి.

రూ. 5,000 – ట్రైసిటీ కన్స్యూమర్ కోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు విరాళంగా ఇవ్వాలి.

అయితే, ఈ కేసులో జోమాటో కేవలం డెలివరీ భాగస్వామి (లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్) మాత్రమేనని, ఆహార తయారీలో దానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ జోమాటోపై ఉన్న ఫిర్యాదును కోర్టు కొట్టివేసింది.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us