AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్లకు ఆ గ్రామానికి బస్సు.. వాళ్ల ఆనందం చూస్తే గుండె ఉప్పొంగాల్సిందే..

స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా, నేటికీ కనీస రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామాలు మన దేశంలో ఇంకా ఉన్నాయనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. రాజస్థాన్‌లోని ఒక మారుమూల గ్రామానికి ఏకంగా 79 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ప్రభుత్వ బస్సు అడుగుపెట్టడంతో ఆ గ్రామస్థుల సంతోషం అంతా ఇంతా కాదు. ఆ వీడియో చూ ఎవరైన ఎమోషనల్ అవుతారు.

Video: స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్లకు ఆ గ్రామానికి బస్సు.. వాళ్ల ఆనందం చూస్తే గుండె ఉప్పొంగాల్సిందే..
First Bus In Village After 79 Years
Krishna S
|

Updated on: Aug 09, 2026 | 8:16 PM

Share

ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంలో రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. డ్రైవర్ లేని కార్లు, గాల్లో ఎగిరే వాహనాలు వాడుకలోకి వస్తున్న ఈ డిజిటల్ యుగంలో.. కనీస రవాణా సదుపాయాలు లేక అల్లాడుతున్న గ్రామాలు మన దేశంలో ఇంకా ఉన్నాయంటే నమ్మగలరా? అలాంటి ఒక గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక ప్రభుత్వ బస్సు అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని కుర్దల్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని ఆ గ్రామస్తులు ఎలా పండగలా జరుపుకున్నారో చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.

తొలి బస్సుకు గ్రామాకారంలో ఘన స్వాగతం..

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తమ ఊరిలోకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బస్సు వస్తుందని తెలిసిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఊరిలోని చిన్న పెద్ద, ఆడా మగా తేడా లేకుండా అందరూ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి బస్సు రాక కోసం ఎదురుచూశారు. బస్సు గ్రామంలోకి ప్రవేశించగానే డప్పు మేళాలు, వాయిద్యాల మోతలతో ఊరంతా హోరెత్తిపోయింది. పూలమాలలు వేసి, బస్సుకు హారతి పట్టి అత్యంత కోలాహలంగా స్వాగతం పలికారు. దశాబ్దాల నిరీక్షణ ఫలించి తమ ఊరికి రవాణా సౌకర్యం కలగడంతో గ్రామస్తుల ముఖాల్లో వ్యక్తమైన ఆనందం మాటల్లో చెప్పలేనిది.

సోషల్ మీడియాలో నెటిజన్ల భావోద్వేగం..

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఒకవైపు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు గ్రామస్తుల అమాయకమైన ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా.. ప్రపంచంలోని మారుమూల మూలల్లో జరిగే వింతలు, విశేషాలు, ప్రజల బాధలను వెలుగులోకి తెచ్చే శక్తి సోషల్ మీడియాకు ఉందని ఈ ఘటన మరొకసారి నిరూపించింది.

వీడియో చూడండి..

Follow Us