Priyanka Jain: బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంకకు సర్జరీ.. టెన్షన్‌ పడుతోన్న ప్రియుడు.. అసలేం జరిగిందంటే? వీడియో

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక తన ఆట తీరు, మాట తీరుతో అభిమానుల మనసులు గెల్చుకుంది. ఆటల్లో నైనా, మాటల్లో నైనా ఎంతో హుందాగా వ్యవహరించిన ఈ కన్నడ బ్యూటీ గ్రాండ్‌ ఫినాలేకు దూసుకెళ్లింది. విజేతగా నిలవకపోయినా ఐదో స్థానంలో నిలిచింది. ఏడో సీజన్‌లో టాప్‌-5లోకి దూసుకెళ్లిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌ ప్రియాంకనే కావడం గమనార్హం.

Priyanka Jain: బిగ్‌బాస్‌ బ్యూటీ ప్రియాంకకు సర్జరీ.. టెన్షన్‌ పడుతోన్న ప్రియుడు.. అసలేం జరిగిందంటే? వీడియో
Bigg Boss 7 Telugu Fame Priyanka Jain
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2024 | 5:52 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కన్నడ ముద్దుగుమ్మ ప్రియాంక జైన్‌ ఒకరు. అంతకు ముందు తెలుగులో మౌనరాగంతో పాటు పలు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఈ గుర్తింపు తోనే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక తన ఆట తీరు, మాట తీరుతో అభిమానుల మనసులు గెల్చుకుంది. ఆటల్లో నైనా, మాటల్లో నైనా ఎంతో హుందాగా వ్యవహరించిన ఈ కన్నడ బ్యూటీ గ్రాండ్‌ ఫినాలేకు దూసుకెళ్లింది. విజేతగా నిలవకపోయినా ఐదో స్థానంలో నిలిచింది. ఏడో సీజన్‌లో టాప్‌-5లోకి దూసుకెళ్లిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌ ప్రియాంకనే కావడం గమనార్హం. బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టే ముందు సింగిల్‌ అని చెప్పిన ప్రియాంక అదే బిగ్‌ బాస్‌ వేదికగా తాను శివ్‌ కుమార్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నానంటూ చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది. ఫ్యామిలీ వీక్‌ ఎపిసోడ్‌లో హౌజ్‌లోకి వచ్చిన అతనిని ప్రేమతో హగ్గులు ఇచ్చింది. అక్కడే తమ పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రియాంకకు సంబంధించి ఒక షాకింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు ప్రియుడు శివ్‌ కుమార్. ఆమె ఒక ముఖ్యమైన సర్జరీ కోసం ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపాడు. అదేంటంటే.. గత 20 ఏళ్లుగా ప్రియాంక కంటి సమస్యలతో బాధపడుతోందట. అందుకే ఆమె ఎప్పుడూ కళ్ల జోడుతోనే కనిపిస్తుంటుందట. షూటింగ్స్‌, ఏవైనా ఫంక్షన్స్‌, పార్టీలు ఉన్నప్పుడు మాత్రం లెన్స్‌ పెట్టుకుంటుందట. అయితే లెన్స్‌ వాడడంతో చాలా ఏళ్లుగా కళ్లజోడు వాడుతోందట. అయితే ఇప్పుడు తన కళ్ల సమస్యను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుందట ప్రియాంక. ఇందు కోసం ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు సర్జరీ చేయించుకోవాలని సూచించారట.

తాజాగా కంటి సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రియుడు షూట్‌ చేసి తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ నెవర్ ఎండింగ్ టేల్స్ లోఅప్‌ లోడ్‌ చేశాడు. అందులో ప్రియాంక ఆస్పత్రికి వెళ్లిన దగ్గరి నుంచి సర్జరీ చేయించుకోవడం వరకూ అన్నీ వివరించాడు శివ్‌. ప్రియాంక బిగ్‌ బాస్‌లో ఉన్నప్పుడు శివ్‌ కూడా ఇలాంటి సర్జరీనే చేయించుకున్నాడట. అందుకే తన ప్రియురాలికి కూడా సర్జరీ చేయించుకోమని సలహా ఇవ్వడం, ఆమె అంగీకరించడం, వైద్యులను కలవడం.. సర్జరీకి పిలవడం.. ఇలా అన్నీ చకచకజరిగిపోయాయట. ‘నాకు 7వ తరగతి నుండి ఐ సైట్‌ ప్రారంభమయ్యింది. దాదాపు 10, 15 సంవత్సరాల నుంచి కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. కళ్లజోడు వల్ల బాగా చిరాకు వస్తుంది. శివ్ సర్జరీ చేయించుకున్నాడు కాబట్టి నాకు అంత భయం లేదు’ అని ప్రియాంక చెప్పగా.. తన లవర్‌కు సర్జరీ జరుగుతున్నందుకు తనకే ఎక్కువగా ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చాడు శివ్‌. దీంతో పాటు తమ రిలేషన్‌ షిప్‌, కళ్ల సర్జరీ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారీ లవ్‌ బర్డ్స్‌. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ