AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tabu-Bigg Boss : ‘బిగ్‏బాస్’కి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ?.. టబు రాక కన్ఫార్మ్..

మరికొన్ని నెలల్లో 'బిగ్‏బాస్' ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ కాబోతుందని ప్రచారం నడుస్తుంది. మార్చిలో ఓటీటీ సీజన్ 2 రాబోతుందని.. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుందని అంటున్నారు. సీజన్ 7లో పాల్గోన్న ఒకరిద్దరూ మరోసారి ఓటీటీలోను ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. అటు తమిళం, కన్నడలోనూ 'బిగ్‏బాస్' చివరి దశకు చేరుకుంది. మరికొన్ని వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మరోవైపు హిందీలో 'బిగ్‏బాస్' షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది..

Tabu-Bigg Boss : 'బిగ్‏బాస్'కి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ?.. టబు రాక కన్ఫార్మ్..
Tabu
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2024 | 2:02 PM

Share

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‏బాస్’. ఇప్పటివరకు అన్ని భాషల్లోనూ ఈషోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడవ సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఇక మరికొన్ని నెలల్లో ‘బిగ్‏బాస్’ ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ కాబోతుందని ప్రచారం నడుస్తుంది. మార్చిలో ఓటీటీ సీజన్ 2 రాబోతుందని.. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుందని అంటున్నారు. సీజన్ 7లో పాల్గోన్న ఒకరిద్దరూ మరోసారి ఓటీటీలోను ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. అటు తమిళం, కన్నడలోనూ ‘బిగ్‏బాస్‘ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మరోవైపు హిందీలో ‘బిగ్‏బాస్’ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.. ఇప్పటివరకు మొత్తం 16 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది.

ఇప్పుడు 17 సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘బిగ్‏బాస్’ సీజన్ 17కు హోస్టింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హిందీలో ఈషో రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‏లో కంటెస్టెంట్స్ ఫిజికల్ అటాక్‏కు పాల్పడుతున్నారు. ఇటీవలే కంటెస్టెంట్ అభిషక్, మరో కంటెస్టెంట్ సమర్థ్ జురెల్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన అభిషేక్ తోటి కంటెస్టెంట్ సమర్థపై చేయి చేసుకున్నాడు. దీంతో అతడిని హౌస్ నుంచి నేరుగా ఎలిమినేట్ చేసింది కెప్టెన్ అంకితా లోఖండే.

దీంతో ‘బిగ్‏బాస్’ తీరుపై అభిషేక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ తప్పులేదని.. సమర్థ్ కావాలని అతడిని రెచ్చగొట్టాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ గొడవపై ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తుండగా.. ఈరోజు సల్మాన్ ఖాన్ తోపాటు స్టేజ్ పై మరో హోస్ట్ కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు ఈసారి ‘బిగ్‏బాస్’ సీజన్17కి సల్మాన్ తోపాటు హోస్టింగ్ చేయబోతుందట.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న అభిషేక్, సమర్థ్ గొడవపై సల్మాన్, టబు కలిసి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. టబు రాకతో ఇప్పుడు ‘బిగ్‏బాస్’ వీకెండ్ ఎపిసోడ్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. వీకెండ్ క వార్’ ఎపిసోడ్ సమయంలో టబు అతిథిగా వచ్చి ఇంటిసభ్యులతో అభిషేక్, సమర్థ్ గొడవపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈవారం టబు ఒక ఇంటి సభ్యుడిని ఎలిమినేట్ చేయనున్నట్లు టాక్.

View this post on Instagram

A post shared by Tabu (@tabutiful)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత