AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామకాయ తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు.. మీకు తెలియని నిజాలు ఇవే..

చలికాలంలో లభించే అమృతం లాంటి పండు జామకాయ. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ పండును చాలామంది ఉదయాన్నే పరగడుపున తింటుంటారు. అయితే ఖాళీ కడుపుతో జామకాయ తింటే నిజంగా బరువు తగ్గుతారా? లేక కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయా? ప్రతిరోజూ ఉదయం జామకాయ తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసుకుందాం.

జామకాయ తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు.. మీకు తెలియని నిజాలు ఇవే..
Eating Guava On An Empty Stomach
Krishna S
|

Updated on: Oct 30, 2026 | 9:22 PM

Share

ప్రస్తుతం మార్కెట్లలో ఎటు చూసినా జామకాయలే కనిపిస్తున్నాయి. తీపి, స్వల్ప పులుపు మేళవింపుతో ఉండే జామకాయ అంటే ఇష్టపడని వారుండరు. ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సంపూర్ణ పండు ఇది. అయితే చాలామందికి వచ్చే ప్రధాన డౌట్ ఏంటంటే.. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో జామకాయ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనివల్ల బరువు తగ్గుతారా? జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం పడుతుంది? వంటి కీలక విషయాలను ప్రముఖ డైటీషియన్ అమ్రీన్ షేక్ వెల్లడించారు.

ఉదయం ఖాళీ కడుపుతో జామకాయ తింటే శరీరంలో ఏం జరుగుతుంది?

జామకాయను ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది: జామకాయలో డైటరీ ఫైబర్ అత్యంత సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రేగుల కదలికలను సులభతరం చేసి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే ఇది తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఫలితంగా అనవసరమైన ఆకలి బాధలు, చిరుతిళ్లపైకి మనసు మళ్లకుండా నియంత్రించవచ్చు.

రోగనిరోధక శక్తి – చర్మ సౌందర్యం: జామపండును విటమిన్ సి ఖజానాగా చెప్పుకోవచ్చు. నిజానికి నారింజ, నిమ్మకాయల కంటే కూడా జామకాయలోనే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, చలికాలంలో వేధించే జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచే కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తికి విటమిన్ సి ఎంతో అవసరం.

బరువు నియంత్రణలో మేలైన సహాయకారి: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి జామకాయ ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండి, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల అతిగా తినే అలవాటును కట్టడి చేస్తుంది. అయితే కేవలం జామపండు తిన్నంత మాత్రాన బరువు తగ్గిపోరని, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం కూడా తోడైనప్పుడే సరైన ఫలితాలు వస్తాయని డైటీషియన్ స్పష్టం చేస్తున్నారు.

రక్తంలో చక్కెర స్థాయిలకు అనుకూలం: జామకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచదు. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు (డయాబెటిస్ ఉన్నవారు) తమ వైద్యుల సలహాతో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

ఎవరు ఖాళీ కడుపుతో తినకూడదు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆరోగ్యవంతులు ఉదయం ఖాళీ కడుపుతో జామకాయను నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అందరి శరీర తత్వం ఒకేలా ఉండదు కాబట్టి కొందరు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి:

సున్నితమైన కడుపు, జీర్ణ సమస్యలు ఉన్నవారు: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా అసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామకాయ తింటే కాస్త ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల అలవాటు లేనివారికి కడుపు ఉబ్బరం, నొప్పి లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

ఎలా తినాలి?

అలాంటి సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో కాకుండా.. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత లేదా గుప్పెడు బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌తో కలిపి తీసుకోవడం మంచిది. అలాగే శరీరానికి తగినంత పీచు అందేలా ఆహారంలో మార్పులు చేస్తూనే, రోజంతా పుష్కలంగా నీరు తాగడం మర్చిపోకూడదు.

రోజుకు ఎన్ని తినాలి? ఎలా తినాలి?

సరైన పరిమాణం: రోజూ ఒక మధ్యస్థ పరిమాణంలో ఉన్న జామకాయను తినడం శరీరానికి సరిపోతుంది.

మసాలాలు వద్దు: చాలామంది జామకాయ ముక్కలపై ఉప్పు, కారం లేదా చాట్ మసాలా చల్లుకుని లాగించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పండులోని సహజ గుణాలు పోయి శరీరంలో సోడియం, ఉప్పు నిల్వలు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి మసాలాలు లేకుండా సహజ రూపంలోనే శుభ్రంగా కడిగి తినడం మంచిది.

Follow Us
జామకాయ తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు.. మీకు తెలియని నిజాలు
జామకాయ తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయొద్దు.. మీకు తెలియని నిజాలు
శని, ఆదివారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
శని, ఆదివారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
15 నిమిషాల్లో చేసుకోగలిగే సాఫ్ట్ రవ్వ బర్ఫీ.. పక్కా కొలతలతో
15 నిమిషాల్లో చేసుకోగలిగే సాఫ్ట్ రవ్వ బర్ఫీ.. పక్కా కొలతలతో
ఆయన నాకోసం ప్రొడ్యుసర్ కాళ్ల మీద పడ్డారు.. జబర్దస్త్ రాజమౌళి
ఆయన నాకోసం ప్రొడ్యుసర్ కాళ్ల మీద పడ్డారు.. జబర్దస్త్ రాజమౌళి
చేదు లేకుండా రెస్టారెంట్ స్టైల్ ఆలూ మేతీ మసాలా కర్రీ
చేదు లేకుండా రెస్టారెంట్ స్టైల్ ఆలూ మేతీ మసాలా కర్రీ
చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. గోల్డ్ మెడల్ గెలిచిన..
చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. గోల్డ్ మెడల్ గెలిచిన..
ఈ వారం కూడా వర్షిణీ సేఫ్.. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
ఈ వారం కూడా వర్షిణీ సేఫ్.. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తున్నవి ఏంటి
పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తున్నవి ఏంటి
డయాబెటిస్‌ ఉంటే వ్యాయామం ఎలా చేయాలి? రక్తంలో చక్కెరను తగ్గించగలదా
డయాబెటిస్‌ ఉంటే వ్యాయామం ఎలా చేయాలి? రక్తంలో చక్కెరను తగ్గించగలదా
గుమగుమలాడే స్పైసీ రొయ్యల పులావ్.. ఒక్కసారి తిన్నారంటే వదలరు
గుమగుమలాడే స్పైసీ రొయ్యల పులావ్.. ఒక్కసారి తిన్నారంటే వదలరు