AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీకి కేంద్ర బృందం.. శని, ఆదివారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..

అర్నబ్ తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాష్ నేతృత్వంలో ఎడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం శని, ఆదివారాల్లో ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. ఈ మేరకు కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నష్టాల్ని పరిశీలించి కేంద్రానికి నివేదికను అందించనుంది.

Andhra News: ఏపీకి కేంద్ర బృందం.. శని, ఆదివారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..
Central Teams Assess Cyclone Arnab Damage
Anand T
|

Updated on: Oct 30, 2026 | 9:17 PM

Share

ఏపీలో అర్నబ్ తుఫాన్ సృష్టించిన బీభత్సానికి చాలా ప్రాంతాల్లో పంట నష్టంతో పాటు రోడ్డు, విద్యుత్ స్థంభాలు ద్వంసమయ్యాయి. దీంతో తుఫాన్ ప్రభావంతపై నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని ఇటీవేలే సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్‌షాకు లేఖ రాయగా.. దానిపై సానుకూలంగా స్పందించిన హోంమంత్రి శనివారం, ఆదివారాల్లో ఏపీ పరిశీలను కేంద్ర బృందాన్ని వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాబోయే రెండ్రోజులు కేంద్ర బృందం తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు.

శనివారం ఆర్టీజిఎస్‌లో తుపాను సమయంలో తీసుకున్న చర్యలు, జరిగన నష్టాలను ఉన్నతాధికారులు బృందానికి వివరించనున్నారు. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు బృందాలుగా ఏర్పడి పర్యటించనున్నారు. మొదటి బృందంతో ఆర్టిజిఎస్ సిఈవో, ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్, రెండవ బృందంతో సెంకడరీ హెల్త్ డైరెక్టర్ చక్రధరబాబు పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.

కేంద్ర బృందం పర్యటించే జిల్లాలు

శనివారం టీం-1 కోనసీమ జిల్లాలో ; టీం-2 తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఆదివారం టీం-1 కాకినాడ జిల్లాలో , టీం-2 పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.

కరువు పరిస్థితులను పరిశీలినకు మరో బృందం

రాష్ట్రంలో ఖరీఫ్-2026 కరువు పరిస్థితులను పరిశీలించి అధ్యయనం చేయడానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ చిన్మయ్ గోట్మారే నేతృత్వంలోని కేంద్ర బృందం కరువు ప్రభావిత సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పది మంది సభ్యులు రెండు బృందాలుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి కరువు పరిస్థితిని విశ్లేషించనున్నట్లు తెలిపారు.

కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ నియమాల ప్రకారం ఖరీఫ్-2026 లో 283 మండలాల్లో తీవ్ర కరువు, 105 మండలాలలో మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకంటించడం జరిగిందన్నారు. బుధవారం ఈ బృందం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని, ఆదివారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
శని, ఆదివారాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
15 నిమిషాల్లో చేసుకోగలిగే సాఫ్ట్ రవ్వ బర్ఫీ.. పక్కా కొలతలతో
15 నిమిషాల్లో చేసుకోగలిగే సాఫ్ట్ రవ్వ బర్ఫీ.. పక్కా కొలతలతో
ఆయన నాకోసం ప్రొడ్యుసర్ కాళ్ల మీద పడ్డారు.. జబర్దస్త్ రాజమౌళి
ఆయన నాకోసం ప్రొడ్యుసర్ కాళ్ల మీద పడ్డారు.. జబర్దస్త్ రాజమౌళి
చేదు లేకుండా రెస్టారెంట్ స్టైల్ ఆలూ మేతీ మసాలా కర్రీ
చేదు లేకుండా రెస్టారెంట్ స్టైల్ ఆలూ మేతీ మసాలా కర్రీ
చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. గోల్డ్ మెడల్ గెలిచిన..
చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. గోల్డ్ మెడల్ గెలిచిన..
ఈ వారం కూడా వర్షిణీ సేఫ్.. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
ఈ వారం కూడా వర్షిణీ సేఫ్.. మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తున్నవి ఏంటి
పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తున్నవి ఏంటి
డయాబెటిస్‌ ఉంటే వ్యాయామం ఎలా చేయాలి? రక్తంలో చక్కెరను తగ్గించగలదా
డయాబెటిస్‌ ఉంటే వ్యాయామం ఎలా చేయాలి? రక్తంలో చక్కెరను తగ్గించగలదా
గుమగుమలాడే స్పైసీ రొయ్యల పులావ్.. ఒక్కసారి తిన్నారంటే వదలరు
గుమగుమలాడే స్పైసీ రొయ్యల పులావ్.. ఒక్కసారి తిన్నారంటే వదలరు
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు
ఇంట్లో Wi-Fiకి పాస్‌వర్డ్ లేకుండానే కనెక్ట్ కావ్వొచ్చు