AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ చేసిన ముస్లిం మత పెద్ద

ఈ హీరోయిన్ కు దైవ భక్తి ఎక్కువ. ముస్లిం అమ్మాయి అయినా తరచూ హిందూ దేవలయాలను సందర్శిస్తుంటుంది. ఇప్పటికే కాశీ, మానస సరోవరం, కేదరినాథ్, బద్రీనాథ్ తదితర దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించిందీ అందాల తార. అయితే ఈ విషయంలో ముస్లిం మత పెద్దలు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Actress: కేదార్‌నాథ్ ఆలయంలో స్టార్ హీరోయిన్ పూజలు.. ఫత్వా జారీ చేసిన ముస్లిం మత పెద్ద
Bollywood Actress
Basha Shek
|

Updated on: Oct 30, 2026 | 8:17 PM

Share

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ చిక్కుల్లో పడింది. ఆమె ఇటీవల కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేయడం వివాదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇస్లామిక్ మత గురువు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ సారా అలీఖాన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఇతర మతాల ఆచారాల్లో పాల్గొనడం షరియత్ ప్రకారం నిషిద్ధమని, సారా చేసిన పని ‘‘పాపం’’అని ఆయన అన్నారు. ఈ మేరకు ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. కాగా సారా అలీ ఖాన్ అక్టోబర్ 25న కేదార్‌నాథ్‌ను ఆలయాన్ని సందర్శించింది. సాధారణ భక్తుల్లాగే క్యూలో నిలబడి దర్శనం చేసుకుంద. ఆ తర్వాత ఆలయం వెలుపల అక్కడి సందర్శకులతో సరదాగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ సారా చర్యలను తప్పుబట్టారు. ఇస్లాం కాకుండా వేరే మతంలో పూజలు చేయడం షరియా ప్రకారం నేరమని మత పెద్ద అన్నారు. నటి సారా వెంటనే అల్లాకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

నటుడు సైఫ్ అలీ ఖాన్, నటి అమృతా సింగ్‌ల కుమార్తె అయిన సారా అలీఖాన్ కు కేదార్ నాథ్ ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది. . ఆమె మొదటి సినిమా పేరే ‘కేదార్‌నాథ్’. ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం దాదాపు ఇక్కడే జరిగింది. ఈ నేపథ్యంలో టైమ్ దొరికినప్పుడల్లా ఆమె ఈ ఆలయాన్ని సందర్శిస్తూ వస్తోంది. అయితే ఈ విషయంలో ఆమె కొంతమంది మత పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ పర్యటన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో చాలా మంది సారాకు సపోర్టుగా నిలుస్తుంటే మరికొందరు మాత్రం మత గురువు ప్రకటనను సమర్థిస్తున్నారు. అయితే ఈ ఫత్వా అలాగే ఈ వివాదంపై సారా అలీ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు.

మరోవైపు, బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ హిందూయేతరుల ప్రవేశానికి సంబంధించి ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఆలయంలో ప్రార్థనలు చేయాలనుకునే హిందూయేతరులు తప్పనిసరిగా ఒక ధృవీకరణ పత్రాన్ని (డిక్లరేషన్ ఫామ్) సమర్పించాలని నిబంధన విధించింది. ఈ నిబంధన ప్రకారం సారా అలీ ఖాన్ బృందం ఆలయంలోకి ప్రవేశించే ముందు అవసరమైన ధృవీకరణ పత్రాన్ని సమర్పించిందని కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సోహన్ సింగ్ రంగర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి
Actress Sara Ali Khan

Actress Sara Ali Khan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us