Hanuman: ‘నా నెక్ట్స్‌ సినిమాలో ఛాన్స్‌ ఇస్తా’..’హనుమాన్‌’ డైరెక్టర్‌ బంపరాఫర్‌.. ఏం చేయాలంటే?

ప్రశాంత్‌ వర్మ- తేజా సజ్జా కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం హనుమాన్‌. అమృతా అయ్యర్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం

Hanuman: 'నా నెక్ట్స్‌ సినిమాలో ఛాన్స్‌ ఇస్తా'..'హనుమాన్‌' డైరెక్టర్‌ బంపరాఫర్‌.. ఏం చేయాలంటే?
Hanuman Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2024 | 5:04 PM

ఈ సంక్రాంతికి వస్తోన్న సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ ఏదంటే అదే ‘హనుమాన్‌’ అని చెప్పుకోవచ్చు. షూటింగ్‌ ప్రారంభం నుంచే ఆసక్తిని రేపుతోన్న ఈ సోషియో ఫాంటసీ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మహేశ్‌, వెంకటేష్‌, నాగార్జున లాంటి స్టార్‌ హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ కంటెంట్‌పై నమ్మకం ఉండడంతో పండగకే రిలీజ్‌ను ఖరారు చేశారు. ప్రశాంత్‌ వర్మ- తేజా సజ్జా కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం హనుమాన్‌. అమృతా అయ్యర్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. తెలుగుతోపాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా మొత్తం 11 భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో హనుమాన్‌ మూవీ రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హనుమాన్‌ సినిమానే హవా కొనసాగిస్తోంది. ఎక్కడ చూసినా ఈ మూవీ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు నెటిజన్లు క్రియేట్‌ చేసిన పోస్టర్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయ. ఈ నేపథ్యంలో హనుమాన్‌ సినిమా కోసం పోస్టర్లు డిజైన్‌ చేస్తోన్న వారికి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఒక బంపరాఫర్‌ ప్రకటించారు. ‘హనుమాన్‌’ సినిమా కోసం ఇప్పటివరకూ మీరు క్రియేట్‌ చేసిన అద్భుత డిజైన్లు చూసి ఎంతో ఆనందించాను. మీరు షేర్‌ చేసిన పోస్టర్లలో కొన్ని నన్ను ఆశ్చర్యపరిచాయి. మా సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ఒక మంచి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నా. ఇకపై మీరు చేసే డిజైన్లను #HanuMania హ్యాష్‌ట్యాగ్‌ జత చేసి మాకు షేర్‌ చేయండి. ఇందులో ది బెస్ట్‌ను ఎంపిక చేసి వారికి నా తదుపరి ప్రాజెక్టులో వర్క్‌ చేసే అవకాశం కల్పిస్తాను’ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు ప్రశాంత్‌ వర్మ.

హనుమాన్‌ సినిమాకు మాస్‌ మహరాజా రవితేజ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. హనుమాన్‌ సినిమాలో రాజ్‌ దీప్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సత్య, గెటప్‌ శీను ప్రధాన పాత్రలు పోషించారు. అనుదీప్‌ దేవ్‌, గౌరా హరి, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందించారు. ఇక సంక్రాంతి కానుకగా మహేశ్‌ బాబు గుంటూరు కారం, వెంకటేశ్‌ సైంధవ, నాగార్జున నా సామిరంగ వంటి పెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకుని తేజ సజ్జా హనుమాన్‌ ఏ మేర కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!