- Telugu News Photo Gallery Cinema photos Mammootty Jeeva Yatra 2 Movie Teaser response in AP politics Telugu Entertainment Photos
Yatra 2: ఎన్నికలకు ముందు పొలిటికల్ సినిమాల సందడి.! అదే తరహాలో యాత్ర 2.
ఎన్నికలకు ముందు పొలిటికల్ సినిమాల సందడి ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు అన్ని చోట్ల ఈ హడావిడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సందడి ఇంకాస్త ఎక్కువగా ఉంది. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆల్రెడీ వెండితెర మీద కూడా హీట్ కనిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో యాత్ర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహి వి రాఘవ, 2024 ఎలక్షన్స్ నేపథ్యంలో యాత్ర 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Updated on: Jan 06, 2024 | 8:52 PM

ఎన్నికలకు ముందు పొలిటికల్ సినిమాల సందడి ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. స్టేట్ నుంచి సెంట్రల్ వరకు అన్ని చోట్ల ఈ హడావిడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సందడి ఇంకాస్త ఎక్కువగా ఉంది. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఆల్రెడీ వెండితెర మీద కూడా హీట్ కనిపిస్తోంది.

2019 ఎన్నికల సమయంలో యాత్ర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహి వి రాఘవ, 2024 ఎలక్షన్స్ నేపథ్యంలో యాత్ర 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తొలి భాగంలో రాజశేఖర్ రెడ్డి పాద యాత్రనే మెయిన్ పాయింట్‌గా చూపించారు. ఆ ఫార్ములా వెండితెర మీద బాగా వర్కవుట్ అయ్యింది.

యాత్ర 2లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర నేపథ్యాన్ని తీసుకున్నారు మహి. తాజాగా యాత్ర 2 టీజర్ రిలీజ్ చేసిన దర్శకుడు, మరోసారి తన మార్క్ చూపించారు. పేరుకు పొలిటికల్ సినిమానే అయినా, యాత్ర కథ మేజర్‌గా హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూనే తిరిగింది.

అందుకే పొలిటికల్ ఇంట్రస్ట్స్‌తో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యింది. యాత్ర 2 విషయంలోనూ ఎమోషన్స్‌నే నమ్ముకున్నారు దర్శకుడు. ఈ సారి కాస్త పొలిటికల్ టచ్ పెంచినట్టుగా అనిపిస్తున్నా... తన మార్క్ సెంటిమెంట్స్, హై సీన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకున్నారు.

అందుకే ఈ టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ఆకట్టుకున్నా సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న డౌట్స్ మాత్రం రెయిజ్ అవుతున్నాయి. రీసెంట్‌గా పొలిటికల్ థీమ్‌తోనే తెరకెక్కిన వ్యూహం సినిమా ఒకటికి రెండు సార్లు వాయిదా పడింది.

దీంతో యాత్ర 2 విషయంలో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది యాత్ర 2.




