- Telugu News Photo Gallery Cinema photos Hero Ram Charan Reveal the business style and his next movies Update Telugu Heroes Photos
Ram Charan: ఉపాసన స్టైల్ వేరు.. నేను బ్యాడ్ బిజినెస్‌మేన్ అంటున్న చెర్రీ.
స్టార్‌డమ్ తన మీద ఒత్తిడి పెంచటం కన్నా మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుందన్నారు చరణ్. ఒక్కోసారి అది భారంగా అనిపించినా... వెంటనే దాన్ని తన బలంగా మార్చుకుంటానన్నారు. ట్రిపులార్ తరువాత తన మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయని, తనకు కూడా మళ్లీ మళ్లీ అలాంటి గ్రేట్ సక్సెస్‌లు ఇవ్వాలని ఉందన్నారు. సినిమా తప్ప తనకు మరో ప్రపంచం తెలియదన్న చరణ్, నటుడిగా, నిర్మాతగా కొనసాగుతానని చెప్పారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Feb 07, 2024 | 7:35 PM

ట్రిపులార్ రిలీజ్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజే మారిపోయింది. పేరుకు సౌత్ డైరెక్టర్స్‌తో వర్క్ చేస్తున్న.. చరణ్ ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ కూడ మన హీరో అపాయిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ గోల్డెన్ ఫేజ్‌లో ఉన్న చరణ్, భార్య ఉపాసనతో కలిసి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. చరణ్ కాంపౌండ్ నుంచి మూవీ అప్‌డేట్స్ లేకపోయినా.. ఈ మధ్య మెగా కపుల్ మీద ఆడియన్స్ ఫోకస్ మాత్రం బాగా పెరిగింది.

ముఖ్యంగా క్లీంకారా పుట్టిన తరువాత చరణ్, ఉపాసన ఎక్కడ కనిపించినా మీడియా కెమెరా వాళ్లనే ఫాలో చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు చరణ్, ఉపాసన. ఈ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు.

స్టార్‌డమ్ తన మీద ఒత్తిడి పెంచటం కన్నా మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుందన్నారు చరణ్. ఒక్కోసారి అది భారంగా అనిపించినా... వెంటనే దాన్ని తన బలంగా మార్చుకుంటానన్నారు.

ట్రిపులార్ తరువాత తన మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయని, తనకు కూడా మళ్లీ మళ్లీ అలాంటి గ్రేట్ సక్సెస్‌లు ఇవ్వాలని ఉందన్నారు. సినిమా తప్ప తనకు మరో ప్రపంచం తెలియదన్న చరణ్, నటుడిగా, నిర్మాతగా కొనసాగుతానని చెప్పారు.

అయితే సినిమా కాకుండా ఇరత వ్యాపారాల విషయంలో తాను బ్యాడ్ బిజినెస్‌మేన్ అన్నారు చెర్రీ. తన జీవితానికి సంబంధించి ప్రతీ నిర్ణయం తానే తీసుకుంటానన్నారు చరణ్.

ఉపాసన కూడా తన బిజినెస్ స్టైల్‌ను రివీల్ చేశారు. నిద్రపట్టనివ్వని స్థాయిలో ప్రెజెర్ ఉన్న వ్యాపారాలు చేయటం తనకు ఇష్టం లేదన్నారు మెగా కోడలు.





























