Nivetha Pethuraj: నివేధా పేతురాజ్ రాడియంట్ ఎనర్జీ రహస్యాలివే! 5 పనులు చేస్తే చాలు..
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అనేది ఎంత ముఖ్యమో, దానిని కాపాడుకోవడానికి చేసే పోరాటం అంతకంటే ముఖ్యం. నిరంతరం షూటింగ్స్, కెమెరా లైట్లు, మేకప్ మధ్య ఉండే నటీనటులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా కష్టం. కానీ, మన 'మెంటల్ మదిలో' భామ మాత్రం ఇందుకు భిన్నం.

కేవలం అందంపైనే కాకుండా.. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వంపై ఆమె చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఫాలో అవుతున్న ఆ పంచ సూత్రాలు ఏంటో తెలిస్తే మీరు కూడా ఫిదా అవ్వాల్సిందే. ఆమె ఒకవైపు వెండితెరపై నటిగా మెప్పిస్తూనే, మరోవైపు రేసింగ్ ట్రాక్‌లపై కార్లతో దూసుకుపోతుంది. అంతటితో ఆగకుండా బాత్ అండ్ బాడీ బ్రాండ్ ఫౌండర్‌గా బిజినెస్ రంగంలోనూ రాణిస్తోంది. ఇంత బిజీ లైఫ్ స్టైల్ లో కూడా ఆమె ముఖంలో ఆ రాడియంట్ గ్లో, ఎనర్జీ ఎలా సాధ్యమని అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు వెల్‌నెస్ ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆ నటి మరెవరో కాదు.. నివేధా పేతురాజ్. ఆమె సక్సెస్ వెనుక ఉన్న ఆ ఐదు సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..
-
-
- నివేధా తన రోజును సూర్యరశ్మితో ప్రారంభిస్తుంది. ఉదయాన్నే ఎండలో కాసేపు గడపడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుందని, ఇది మూడ్ బూస్ట్ చేయడమే కాకుండా చర్మం మెరిసేలా చేస్తుందని ఆమె చెబుతోంది. కేవలం సూర్యరశ్మి మాత్రమే కాకుండా విటమిన్ సి సీరమ్, సన్‌స్క్రీన్ కాంబోను ఆమె కచ్చితంగా ఫాలో అవుతుంది.
- ఆమె రోజువారీ పానీయాల్లో గ్రీన్ టీకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే గ్రీన్ టీ మెటబాలిజాన్ని పెంచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచడంలో ఇది తనకు ఎంతో సహాయపడుతుందని నివేధా పేర్కొంది.
- సాధారణంగా హీరోయిన్లు జిమ్‌లో వర్కవుట్లు చేస్తారు. కానీ నివేధాకు గోల్ఫ్ అంటే ప్రాణం. సాయంత్రం వేళల్లో గోల్ఫ్ ఆడటం వల్ల బాడీ మూవ్‌మెంట్ తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె సోషల్ మీడియా బయోలో కూడా గోల్ఫ్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఇది కీళ్లకు ఎంతో రక్షణనిచ్చే వ్యాయామం అని ఆమె సూచిస్తోంది.
- ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని షూటింగ్‌లు ఉన్నా మెడిటేషన్ కోసం ఆమె కచ్చితంగా సమయం కేటాయిస్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ క్లియర్ అయి, ఎనర్జీ రీఛార్జ్ అవుతుందని ఆమె అభిప్రాయం. సెల్ఫ్-కేర్ లో ఇది అత్యంత ముఖ్యమైన భాగమని ఆమె చెబుతోంది.
- “A lot of work” అంటూ తన పని పట్ల ఉన్న మక్కువను నివేధా చాటిచెప్పింది. నటనతో పాటు తన కొత్త బ్రాండ్ ‘బ్యాక్ హోమ్ కంపెనీ’ పనులను ఆమె ఎంతో ఇష్టంగా చేస్తుంది. పనిని భారంలా కాకుండా ఒక బాధ్యతగా, ఇష్టంగా చేయడం వల్ల అలసట రాదని ఆమె నిరూపిస్తోంది.
-
View this post on Instagram
నివేధా పేతురాజ్ చెబుతున్న ఈ విషయాలు చాలా సింపుల్‌గా అనిపించినా, వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆమె లైఫ్ స్టైల్ చూస్తే అర్థమవుతుంది. ఫ్యాన్సీ గ్యాడ్జెట్లు లేదా కఠినమైన నియమాలు కాకుండా, ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఆమె అసలు రహస్యం.
