AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arora: మలైకా ఫ్లాట్ బెల్లీ సీక్రెట్ ఇదే.. 50ఏళ్ల వయసులోనూ 25 సంవత్సరాల యువతిలా!

సినిమా అనే రంగుల ప్రపంచం, ఫిట్‌నెస్ రంగంలో వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్న స్టార్ నటి ఆమె. ఐదు పదుల వయసులో కూడా పాతికేళ్ల యువతిలా కనిపిస్తూ, తన టోన్డ్ బాడీ, ఫిట్‌నెస్‌తో కుర్రకారుకు సైతం చెమటలు పట్టిస్తోంది.

Malaika Arora: మలైకా ఫ్లాట్ బెల్లీ సీక్రెట్ ఇదే.. 50ఏళ్ల వయసులోనూ 25 సంవత్సరాల యువతిలా!
Malaika Aroraa
Nikhil
|

Updated on: Feb 21, 2026 | 6:15 AM

Share

యోగా నుండి జిమ్ వర్కవుట్ల వరకు ఆమె చేసే ప్రతి ప్రయత్నం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది. తాజాగా ఆమె తన ఫ్లాట్ బెల్లీ మరియు స్ట్రాంగ్ బాడీ వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. కేవలం ఒకే ఒక పరికరంతో ఇంట్లోనే సులభంగా చేయగలిగే ఆ వర్కవుట్ విశేషాలేంటో తెలుసుకుందాం..

బాలీవుడ్ ఫిట్‌నెస్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆ భామ తన ఎనర్జీతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గంటల తరబడి జిమ్ లో కష్టపడటం కంటే, క్రమశిక్షణతో కూడిన చిన్న చిన్న వర్కవుట్లే మెరుగైన ఫలితాలనిస్తాయని ఆమె నమ్ముతుంది. తాజాగా తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో “5 ఎఫెక్టివ్ కెట్టిల్‌బెల్ మూవ్‌మెంట్స్” పేరుతో ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె సూచించిన పద్ధతులు పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడమే కాకుండా, పూర్తి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. ఆ ఫిట్‌నెస్ ఐకాన్ మరెవరో కాదు.. మలైకా అరోరా. ఆమె సక్సెస్ మంత్రం ఏంటో చూద్దాం.

కెట్టిల్‌బెల్ వర్కవుట్..

మలైకా ప్రకారం “కన్సిస్టెన్సీ ఈజ్ కీ” (స్థిరత్వం ముఖ్యం). రోజూ నిర్ణీత సంఖ్యలో రిపీట్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి భాగం టోన్ అవుతుంది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారికి, జాయింట్ నొప్పులు ఉన్నవారికి ఇది చాలా సేఫ్ వర్కవుట్.

ఆమె సూచించిన ఆ ఐదు కీలక మూవ్‌మెంట్స్ ఇవే.

  1. కెట్టిల్‌బెల్ స్వింగ్స్ ఇది మలైకాకు అత్యంత ఇష్టమైన వ్యాయామం. రోజూ 80 కెట్టిల్‌బెల్ స్వింగ్స్ చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు మంచులా కరిగిపోయి, పొట్ట ఫ్లాట్ గా మారుతుందని ఆమె చెబుతోంది. ఇది హిప్స్, బ్యాక్ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా దోహదపడుతుంది.
  2. సైడ్ స్వింగ్స్ నడుము పక్క భాగంలో పేరుకుపోయిన కొవ్వు పోవాలంటే సైడ్ స్వింగ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి వెయిస్ట్‌లైన్ ను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, శరీరానికి రొటేషనల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి.
  3. కెట్టిల్‌బెల్ డెడ్‌లిఫ్ట్స్ కాళ్లు, గ్లూట్స్ దృఢంగా మారడానికి ఈ వ్యాయామం ఎంతో అవసరం. దీనివల్ల నడిచేటప్పుడు కాళ్ల మధ్య రాపిడి (Chafing) తగ్గుతుందని, శరీర ఆకృతి మెరుగుపడుతుందని మలైకా వివరిస్తోంది. ఇవి లోయర్ బాడీకి మంచి బలాన్ని ఇస్తాయి.
  4. కెట్టిల్‌బెల్ పుల్స్ చేతులు, భుజాలు అందంగా కనిపించాలంటే పుల్స్ చేయాలి. ఇవి అప్పర్ బాడీని టోన్ చేయడమే కాకుండా, భుజాలు నేరుగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల పోస్చర్ మెరుగుపడి మీరు మరింత ఎత్తుగా, కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు.

మలైకా ఇచ్చే టిప్స్..

  • 80 రిపీట్స్ టార్గెట్: మలైకా రోజూ 80 రిపీట్స్ చేయమని సూచిస్తుంది. అయితే కొత్తగా మొదలుపెట్టేవారు 20 నుండి 30 రిపీట్స్ తో స్టార్ట్ చేసి మెల్లగా సంఖ్యను పెంచాలి.
  • కంట్రోల్ ముఖ్యం: వేగం కంటే బాడీ పొజిషన్ సరిగ్గా ఉండటం ఇక్కడ ముఖ్యం. తప్పుగా చేస్తే వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
  • మానసిక ప్రశాంతత: “Protect your peace, move the body” అంటూ కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలని ఆమె హితవు పలికింది.

ఈ ఎండల్లో బయట నడవడం కష్టంగా అనిపిస్తే, ఇంట్లోనే ఒక కెట్టిల్‌బెల్ పట్టుకుని మలైకా చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే చాలు. కొద్ది రోజుల్లోనే మీ బాడీలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఫిట్‌నెస్ అంటే ఏదో కష్టమైన పని కాదు, ఇష్టంగా చేసే జీవనశైలి అని మలైకా అరోరా మరోసారి నిరూపించింది.

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం