AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవి అనుగ్రహంతో వీరికి గోల్డెన్ టైమ్..! కెరీర్‌లో కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు

Sun Transit in Swati Nakshatra: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వానికి సూచికగా భావించబడతాడు. స్వాతి నక్షత్రానికి రాహువు అధిపతి. సూర్యుడు అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించి.. నవంబర్ 8 వరకు అక్కడ కొనసాగుతాయి. స్వాతి నక్షత్రంలో సూర్యుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి కొత్త అవకాశాలు లభించవచ్చని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు.

Janardhan Veluru
|

Updated on: Oct 15, 2026 | 4:59 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, అధికారం, గౌరవం, నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా భావిస్తారు. సూర్యుడి రాశి మార్పుతో పాటు నక్షత్ర మార్పు కూడా కొన్ని రాశుల వారి జీవితాలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. ఈ నేపథ్యంలో 2026 అక్టోబర్ 24న సూర్యుడు రాహువు ఆధిపత్యంలోని స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. నవంబర్ 8 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

1 / 5
మిథున రాశి: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులు తమ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి తగిన సహకారం లభిస్తుంది. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు, వ్యాపార సంబంధాలు ఏర్పడే అవకాశముంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడి పాత అపార్థాలను తొలగించుకోవడానికి ఇది అనుకూల సమయం.

2 / 5
తుల రాశి: ఈ రాశి వారికి సూర్యుడి స్వాతి నక్షత్ర సంచారం ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ఇక ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశముంది. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల పరిణామాలు అనుభవంలోకి వస్తాయి. వ్యాపారులు కొత్త పరిచయాల ద్వారా వ్యాపార విస్తరణకు ప్రయత్నించవచ్చు. వ్యక్తిగత సంబంధాల్లో పరస్పర అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది.

3 / 5
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి వృత్తిపరంగా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు రావచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఉద్యోగంలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. చేసిన పనికి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. అయితే, కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు వాటికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడం మంచిది.

4 / 5
కుంభ రాశి: ఈ రాశి వారికి వృత్తి, ఆర్థిక వ్యవహారాల్లో పురోగతికి సంబంధించిన అవకాశాలు కనిపించే అవకాశముంది. కొత్త ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారంలో కొత్త పరిచయాలు, ప్రణాళికలు ఉపయోగపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమన్వయం పెంచుకోవడం, ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. (గమనిక: ఈ కథనాన్ని జ్యోతిష్య నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. ఇందులోని సమాచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవు)

5 / 5
Follow Us