AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్ కేక్‌ల్లా వరల్డ్ కప్ 2027 టికెట్లు.. 12 రోజుల్లో కోటిన్నర దరఖాస్తులు!

హాట్ కేక్‌ల్లా వరల్డ్ కప్ 2027 టికెట్లు.. 12 రోజుల్లో కోటిన్నర దరఖాస్తులు!

Phani CH
|

Updated on: Oct 15, 2026 | 4:33 PM

Share

2027 వన్డే ప్రపంచకప్‌ టికెట్లకు భారీ స్పందన లభించినట్లు ఐసీసీ వెల్లడించింది. టికెట్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రారంభమైన 12 రోజుల్లోనే 142 దేశాల నుంచి 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ 2027 అక్టోబర్‌ 2న ప్రారంభం కానుందని, నవంబర్‌ 21న జొహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్‌ జరగనుందని కథనం పేర్కొంది.

క్రికెట్ అభిమానుల్లో ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీ ఆరంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, టికెట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. టికెట్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు రావడం క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలుస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ కోసం ఏకంగా 142 దేశాల నుంచి అభిమానులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్రికా గడ్డపై ఈ టోర్నీ జరుగుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం తారస్థాయికి చేరింది. తొలి వారంలోనే 10 లక్షల దరఖాస్తులు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా పెరిగింది. ఈ స్పందనపై ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. టోర్నీపై ఉన్న ఆకర్షణే ఈ భారీ స్పందనకు కారణమని తెలిపారు. అభిమానులు టికెట్ల బ్యాలెట్ కోసం రిజిస్టర్ చేసుకునేందుకు 2026 నవంబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారు. 2027 అక్టోబర్ 2న నమీబియాలో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా, సరిగ్గా ఏడాది తర్వాత 2027 నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టోర్నీ ఆరంభానికి ముందే టికెట్లకు ఈ స్థాయిలో డిమాండ్ రావడం ఈ ప్రపంచకప్ సక్సెస్‌పై ముందే స్పష్టతనిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!

విమానంలో షాకింగ్‌ ఘటన.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికిన నటి

అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..

అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!

Follow Us