Hrithik Roshan Birthday: హృతిక్ చెంప చెళ్లుమనిపించిన నటి.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో
'కహో నా ప్యార్ హై' సినిమాతో అరంగేట్రం చేసిన హృతిక్.. ఒకదాని తర్వాత ఒకటి హిట్ చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచుకున్నాడు. బాలీవుడ్‌లో గ్రీకు దేవుడి అంటూ ఆయనను పిలుస్తూ ఉంటారు. తనహ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయలను ఆకట్టుకుంటున్నాడు హృతిక్. సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అద్భుతమైన డాన్స్ తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో అరంగేట్రం చేసిన హృతిక్.. ఒకదాని తర్వాత ఒకటి హిట్ చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచుకున్నాడు. బాలీవుడ్‌లో గ్రీకు దేవుడి అంటూ ఆయనను పిలుస్తూ ఉంటారు. తనహ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయలను ఆకట్టుకుంటున్నాడు హృతిక్. సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేడు ఈ హ్యాండ్సమ్ హంక్ పుట్టిన రోజు.
హృతిక్ తన తండ్రి, నటుడు-దర్శకుడు రాకేష్ రోషన్ తో కలిసి కహో నా ప్యార్ హైతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాల తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. నేడు( జనవరి 10) హృతిక్ తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఆయన జీవితం జీవిత విషయాలు కొన్ని తెలుసుకుందాం.
2003లో విడుదలైన హృతిక్ సినిమా ‘కోయి మిల్ గయా’ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులో హృతిక్‌తో పాటు ప్రీతి జింటా మరియు రేఖ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. హృతిక్ మరియు గ్రహాంతరవాసుల మధ్య ఉన్న స్నేహం ఆధారంగా ఈ చిత్రం కథను రూపొందించారు. అదే సినిమా సమయంలో, రేఖ హృతిక్‌ని చెంప పై గట్టిగా కొట్టింది. ఈ సినిమాలో హృతిక్ తన తండ్రి కంప్యూటర్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించే సన్నివేశం ఉంది. అప్పుడే, హృతిక్ తల్లి రేఖ అక్కడికి చేరుకుని హృతిక్‌ని చెంప పై బలంగా కొట్టింది. అయితే ఆ చెంపదెబ్బ నిజంగానే హృతిక్ కు గట్టిగా తగిలింది. అయితే సీన్‌ని షూట్ చేయడానికి ముందు, ఈ సీన్‌ని రియల్‌గా చూపించడానికి నేను నిన్ను గట్టిగా కొడతాను అని రేఖ హృతిక్‌తో చెప్పింది. అయితే హృతిక్ దాన్ని సీరియస్ గా తీసుకోలేదట.. కానీ సీన్ స్టార్ట్ అవ్వడంతో రేఖ వేగంగా వచ్చి హృతిక్ ని గట్టిగా కొట్టింది. ఇంత పెద్ద శబ్ధం రావడంతో పాటు చెంపలు ఎర్రబడిపోతాయని హృతిక్‌కి తెలియదు. దాంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి