“సెన్సార్ బోర్డు నా సినిమాను చంపేసింది”.. అక్షయ్ కుమార్ దర్శకుడి ఆవేదన
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ రీసెంట్ గా వచ్చిన డంకి సినిమాలు బాలీవుడ్ ను బాగానే ఆదుకున్నాయి. అయితే సెన్సార్ బోర్డు కారణంగా తన సినిమా నాశనం అయ్యిందని అంటున్నారు అక్షయ్ కుమార్ దర్శకుడు. తన కథను సెన్సార్ బోర్డు చంపేసింది ఆరోపించారు ఆయన. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..
బాలీవుడ్ లో గత ఏడాది కాస్త పర్లేదు అనే చెప్పాలి.. అంతకు ముందు వరుసగా డిజాస్టర్స్ తో సతమతం అయినా హిందీ ఇండస్ట్రీ 2023 లో మంచి హిట్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ రీసెంట్ గా వచ్చిన డంకి సినిమాలు బాలీవుడ్ ను బాగానే ఆదుకున్నాయి. అయితే సెన్సార్ బోర్డు కారణంగా తన సినిమా నాశనం అయ్యిందని అంటున్నారు అక్షయ్ కుమార్ దర్శకుడు. తన కథను సెన్సార్ బోర్డు చంపేసింది ఆరోపించారు ఆయన. ఇంతకు అసలు ఏం జరిగిందంటే.. గత ఏడాది అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ2 సినిమా రిలీజ్ అయ్యింది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కథ బాగానే ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించలేదు.
గత ఏడాది సన్నీ డియోల్ ‘గదర్ 2 మూవీ’ , అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠిల ఓఎంజీ2 కలిసి విడుదలయ్యాయి. ‘గదర్ 2’ భారతదేశంలో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. ‘ ఓఎంజీ2 ‘ కలెక్షన్ దాదాపు రూ.100 కోట్ల దగ్గర ఆగిపోయాయి. ఈ సినిమా తక్కువ వసూళ్లు రావడానికి సెన్సార్ బోర్డు కారణమని దర్శకుడు అమిత్ రాయ్ అభిప్రాయపడ్డారు. ఓఎంజీ2 సినిమాలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చూపించారు. భారతదేశంలో పిల్లలకు దీని గురించి తక్కువ అవగాహన ఉంది. దీనిపై చాలామంది నోరు విప్పడం లేదు. దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో సినిమా తీశామని అన్నారు దర్శకుడు. అయితే ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ రావడంతో 18 ఏళ్ల లోపు వారు సినిమాను చూడలేకపోయారు. అసలు లక్ష్యం దెబ్బతినడంతో పాటు సినిమా వసూళ్లు కూడా తగ్గాయని అమిత్ ఆరోపిస్తున్నారు.
మా సినిమాకు ఏ సర్టిఫికెట్ రాకపోతే ‘గదర్ 2’కి సమానమైన ఫైట్ ఇచ్చేవాళ్లం. ఎ సర్టిఫికెట్ ఇవ్వకుంటే మా సినిమా చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చేవారు’ అని అమిత్ రాయ్ అన్నారు. ‘గదర్ 2’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.686 కోట్లు, ‘ఓఎంజీ2′ ప్రపంచవ్యాప్తంగా రూ.221.75 కోట్లు వసూలు చేసింది.‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చి నా సినిమాని చంపేశారు. సెన్సార్ బోర్డు నన్ను ఆర్థికంగానూ, సినిమా పరంగానూ దెబ్బతీసింది’ అని అమిత్ అన్నారు. ఈ చిత్రంలో 27 మార్పులు జరిగాయి. చాలా సీన్స్ కట్ చేశారు.
అక్షయ్ కుమార్ ఇన్ స్టాగ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి