Kangana Ranaut: ఆ సినిమాకు అన్నీ అడ్డంకులే.. కథ రెడీగా ఉన్నా సినిమా చేయలేకపోతున్నానన్న కంగనా
బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ పైనే తీవ్ర విమర్శలు చేసింది ఈ చిన్నది. అక్కడి స్టార్ హీరోల పై ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది కంగనా. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా పెట్టింది పేరు. ఇటీవలే కంగనా తేజస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ ఓ సినిమా చేయాలనీ ఉంది కథ కూడా సిద్దమైంది కానీ సినిమా చేయలేకపోతున్న అని కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ గా పేరుతెచ్చుకుంది కంగనా రనౌత్. ఈ అమ్మడు సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ పైనే తీవ్ర విమర్శలు చేసింది ఈ చిన్నది. అక్కడి స్టార్ హీరోల పై ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచింది కంగనా. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కంగనా పెట్టింది పేరు. ఇటీవలే కంగనా తేజస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ ఓ సినిమా చేయాలనీ ఉంది కథ కూడా సిద్దమైంది కానీ సినిమా చేయలేకపోతున్న అని కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలు కంగనా తీయలేకపోతున్న సినిమా ఏది.? దాని కథ ఏంటి .?
బిల్కిస్ బానో కేసుపై మళ్లీ చర్చ జోరందుకుంది. 2002లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 11 మంది నిందితులను విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో బిల్కిస్ బానో జీవితంపై సినిమా తీస్తారా అని నెటిజన్లు కంగనా రనౌత్‌ను ప్రశ్నించారు . దీనిపై స్పందించిన కంగనా కొన్ని షాకింగ్ నిజాలను వెల్లడించింది. స్క్రిప్టు సిద్ధమైనా ఈ కేసుపై సినిమా తీయలేకపోతున్నానని తెలిపింది కంగనా. అందుకు కారణం కూడా చెప్పింది.
ఆ కథను సినిమాగా తీయాలనుకుంటున్నాను. స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. మూడేళ్లు ఆ సబ్జెక్ట్ పై రీసెర్చ్ చేస్తున్నా… అలాంటి రాజకీయ ప్రేరేపిత కంటెంట్‌తో సినిమా తీయకూడదని ప్రముఖ ఓటీటీ సమస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్‌ఫ్లిక్స్ నాకు చెప్పాయి. నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను కాబట్టి, జియో సినిమా వాళ్ళు నాతో కలిసి పని చేయమని తేల్చి చెప్పారు. ఇంకొంతమంది కూడా ఈ సినిమా తీయడానికి ముందు రావడం లేదు. నాకు ఇంకా ఏ ఆప్షన్ ఉంది.? అని కంగనా తెలిపింది. కంగనా రనౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అంతకుముందు, ఆమె ఆమె అభ్యంతరకరమైన పోస్ట్‌ల చేసిన కారణంగా కంగనా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చేయబడింది. తర్వాత తన ఖాతాను తిరిగి పొందింది కంగనా.
The latest trend of films where women are reduced to mere flower on the wall, violently and disgracefully stripped of their dignity and clothes is beyond appalling. Reminds me of the time when I entered films, vulgar item numbers, quick in and out sleazy and dumb roles against…
— Kangana Ranaut (@KanganaTeam) January 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి