12th Fail Movie: హాలీవుడ్‌ సినిమాలను వెనక్కినెట్టి.. హిస్టరీ క్రియేట్‌ చేస్తున్న ఇండియన్ ఫిల్మ్.

12th Fail Movie: హాలీవుడ్‌ సినిమాలను వెనక్కినెట్టి.. హిస్టరీ క్రియేట్‌ చేస్తున్న ఇండియన్ ఫిల్మ్.

Anil kumar poka

|

Updated on: Jan 10, 2024 | 1:11 PM

ప్రస్తుతం దేశం మొత్తం ఒకే సినిమా గురించి మాట్లాడుకుంటుంది. థియేటర్లలో అస్సలు పట్టించుకోని జనాలు.. ఇప్పుడు ఓటీటీలో వెతికి మరీ చూస్తున్నారు. దీంతో డిజిటల్ ప్లాట్ ఫాంపై అత్యధిక వ్యూస్‏తో దూసుకెళ్తుంది. అదే '12th ఫెయిల్' ఫిల్మ్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషిల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. ఇందులో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రస్తుతం దేశం మొత్తం ఒకే సినిమా గురించి మాట్లాడుకుంటుంది. థియేటర్లలో అస్సలు పట్టించుకోని జనాలు.. ఇప్పుడు ఓటీటీలో వెతికి మరీ చూస్తున్నారు. దీంతో డిజిటల్ ప్లాట్ ఫాంపై అత్యధిక వ్యూస్‏తో దూసుకెళ్తుంది. అదే ’12th ఫెయిల్’ ఫిల్మ్. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ ఆఫీసర్ శ్రద్ధా జోషిల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. ఇందులో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, అనంత్ విజయ్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది అక్టోబర్ 27న బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన ఈ సినిమాకు అంతగా ఆదరణ లభించలేదు. కానీ పాజిటివ్ రివ్యూస్ మాత్రం వచ్చాయి. దీంతో ఈ సినిమాను గతేడాది నవంబర్ 3న తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అంతగా రెస్పాన్స్ అందుకోలేదు. కానీ ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేయగా.. అందరి దృష్టి సినిమాపైనే ఉండిపోయింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. ’12th ఫెయిల్’ సినిమా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDBలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. మొత్తం 46,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధారంగా 10కి 9.2 రేటింగ్‌తో IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ మూవీగా నిలిచింది. త్రీ ఇడియట్స్, దంగల్, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రేటింగ్స్ సైతం అధిగమించింది. అంతేకాదు గతేడాది విడుదలైన స్పైడర్ మ్యాన్.. అక్రాస్ ది స్పైడర్ వెర్స్ , ఓపెన్ హైమర్ , గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 లాంటి చిత్రాల ఐఎండీబీ రేటింగ్ కంటే ఎక్కువ రేటింగ్ ఈ సినిమా సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ టాప్ 250 సినిమాల్లో ’12th ఫెయిల్’ మూవీ మొదటి స్థానంలో నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos