AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayalaan: సంక్రాంతి రేసు నుంచి మరో సినిమా ఔట్.. శివ కార్తికేయన్‌ ‘అయలాన్‌’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ వాయిదా

ఒకటి ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ కాగా, మరొకటి శివ కార్తికేయన్‌ నటించిన అయలాన్‌. రెండు స్టార్‌ హీరోల సినిమాలే. తెలుగులోనూ వీరికి మంచి క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని ముందే గ్రహించి ధనుష్‌ కెప్టెన్ మిల్లర్‌ వాయిదా పడింది. తమిళంలో ఈ మూవీ సంక్రాంతికే రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగులో మాత్రం వారం రోజుల తర్వాతే రిలీజ్‌ కానుంది.

Ayalaan: సంక్రాంతి రేసు నుంచి మరో సినిమా ఔట్.. శివ కార్తికేయన్‌ 'అయలాన్‌' తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ వాయిదా
ShivaKarthikeyan's Ayalaan Movie
Basha Shek
|

Updated on: Jan 08, 2024 | 9:15 PM

Share

గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సంక్రాంతికి బోలెడన్ని సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. మొదట తెలుగులోనే ఏకంగా ఐదు సినిమాలు పొంగల్‌ బరిలో నిలిచాయి. పైగా అన్నీ స్టార్‌ హీరోల సినిమాలే. దీంతో థియేటర్లను వెతుక్కోవడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో ముందు జాగ్రత్తగా రవితేజ ఈగల్‌ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు పొంగల్‌ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటికి కూడా థియేటర్ల కేటాయింపుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తెలుగు సినిమాలకు తోడు ఈసారి రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి వద్దామనుకున్నాయి. అందులో ఒకటి ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ కాగా, మరొకటి శివ కార్తికేయన్‌ నటించిన అయలాన్‌. రెండు స్టార్‌ హీరోల సినిమాలే. తెలుగులోనూ వీరికి మంచి క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితిని ముందే గ్రహించి ధనుష్‌ కెప్టెన్ మిల్లర్‌ వాయిదా పడింది. తమిళంలో ఈ మూవీ సంక్రాంతికే రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగులో మాత్రం వారం రోజుల తర్వాతే రిలీజ్‌ కానుంది.

కెప్టెన్ మిల్లర్ బాటలోనే శివ కార్తికేయన్ అయలాన్..

శివ కార్తి కేయన్ అయలాన్‌ సినిమా మాత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్‌ చేయాలని నిర్మాతలు భావించారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు డబ్బింగ్‌ రైట్స్‌ కొనడంతో కొన్ని థియేటర్లైనా దక్కుతాయనుకున్నారు. అయితే ఇప్పుడు అయలాన్‌ సినిమా రిలీజ్‌ కూడా వాయిదా పడింది. సరిపడా థియేటర్లలు లేకపోవడమే అయలాన్‌ తెలుగు వెర్షన్‌ వాయిదాకు కారణమని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాతే అంటే జనవరి 12 లేదా 19న శివ కార్తి కేయన్ సినిమా తెలుగులో విడుదల కావొచ్చని తెలుస్తోంది. రవి కుమార్‌ తెరకెక్కించిన అయలాన్ సినిమాలో శివకార్తికేయన్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇషా కొప్పికర్, శరత్ కేల్కర్, భాను ప్రియ, యోగిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ అందించడం విశేషం. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

అయలాన్ తెలుగు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!