Chiranjeevi: అయోధ్య రామమందిరం ఆహ్వానం అందింది.. ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నా: మెగాస్టార్‌ చిరంజీవి

రఘురాముడు కొలువైన అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు గానూ దేశంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు.

Chiranjeevi: అయోధ్య రామమందిరం ఆహ్వానం అందింది.. ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నా: మెగాస్టార్‌ చిరంజీవి
Chiranjeevi Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2024 | 3:23 PM

రఘురాముడు కొలువైన అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు గానూ దేశంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రామ మందిర పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భాగం కానున్నారు. టాలీవుడ్ నుంచి పలువురి ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. తాజాగా తనకు కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిందని మెగాస్టార్‌ చిరంజీవి స్పష్టం చేశరు. ఈనెల 22న కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లనున్నామని ఆయన తెలిపారు. ఆదివారం (జనవరి 07) హైదరాబాద్‌ వేదికగా జరిగిన హనుమాన్‌ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ ‘అయోధ్య రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ఈ మహోత్తర కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మా కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్తున్నాను’ అని ప్రేక్షకులకు తెలియజేశారు.

కాగా అయోధ్య రామ మందిరం కోసం హనుమాన్ మూవీ టీం సంచలన నిర్ణయం తీసుకుంది. హనుమాన్‌ మూవీ ప్రతి టికెట్‌పై రూ.5లు అయోధ్య రామ మందిరానికి విరాళంగా వెళుతుందని హనుమాన్‌ టీమ్ ప్రకటించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఇప్పటికే సూపర్‌ స్టార్ రజనీకాంత్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లకు ఆహ్వానం అందింది. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, వ్యాపార దిగ్గజం రతన్‌ టాటాలకు కూడా ఆహ్వానం అందింది. ఇక సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే.. పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ సూపర్‌ స్టార్ యశ్, సన్నీడియోల్, అలియా భట్-రణ్‌ బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలి, రోహిత్ శెట్టి తదితరులు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందుకున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రతి టికెట్ పై రూ. 5 అయోధ్య రామ మందిరానికి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో