AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన.. సీతకు అందిన ఆహ్వానం.. సతీసమేతంగా పిలుపు అందుకున్న అలియా

ఉత్తర ప్రదేశ్‌ అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా ఆదిపురుషుడి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాముడి ప్రతిష్ఠాపన వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు

Alia Bhatt: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన.. సీతకు అందిన ఆహ్వానం.. సతీసమేతంగా పిలుపు అందుకున్న అలియా
Ranbir Kapoor, Alia Bhatt
Basha Shek
|

Updated on: Jan 10, 2024 | 2:19 PM

Share

ఉత్తర ప్రదేశ్‌ అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు శాస్త్రోక్తంగా ఆదిపురుషుడి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాముడి ప్రతిష్ఠాపన వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఇందులో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇప్పటికే రజనీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, మితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగన్‌ తదితర సినీ సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ అలియా భట్‌, రణ్‌ బీర్‌ కపూల్‌ దంపతులకు అయోధ్య రాముడి నుంచి పిలుపు వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు సునీల్‌ అంబేకర్‌, అఖిల్‌ భారతీయ, అజయ్‌ ముద్‌పే ప్రముఖ నిర్మాత మహవీర్‌ జైన్‌ అలియా, రణ్‌బీర్‌ల నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు తరణ్‌ ఆదర్శ్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ‘ప్రాణప్రతిష్ఠ’ కోసం లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా . సాంప్రదాయ నాగార శైలిలో నిర్మించిన రామాలయ సముదాయం 380 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గతంలో నివేదించారు. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుందని, మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయని చంపత్‌ రాయ్‌ తెలిపారు

ఇక విదేశాల్లో తమ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న తర్వాత, రణబీర్ అలియా, తమకుమార్తె రాహా కపూర్‌తో కలిసి ముంబైకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత రణబీర్ తల్లి, నటి నీతూ కపూర్ అలియా తండ్రి, చిత్రనిర్మాత మహేష్ భట్‌తో కలిసి యానిమల్ సక్సెస్ మీట్‌కు హాజరయ్యారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అలియా భట్ సీత రోల్‌ పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి