Ustad Rashid Khan Death: మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ ఇకలేరు.. సీఎం మమతా బెనర్జీ సంతాపం

మ్యూజిక్‌ మ్యాస్ట్రోగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) కన్నుమూశారు. గత కొంత కాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై, ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన్ని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాం..

Ustad Rashid Khan Death: మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ ఇకలేరు.. సీఎం మమతా బెనర్జీ సంతాపం
Ustad Rashid Khan
Follow us

|

Updated on: Jan 09, 2024 | 7:36 PM

మ్యూజిక్‌ మ్యాస్ట్రోగా పేరుగాంచిన ప్రముఖ గాయకుడు ఉత్సాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) కన్నుమూశారు. గత కొంత కాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై, ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన్ని కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాం.. కానీ మా ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3:45 గంటలకు ఆయన మరణించారు అని ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.

ఉత్సాద్‌ రషీద్ ఖాన్ మరణం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ‘ఇది యావత్ దేశానికి, మొత్తం సంగీత సోదరులకు తీరని లోటు. రషీద్ ఖాన్ ఇక లేరని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బుధవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల సమయంలో గన్ సెల్యూట్, ప్రభుత్వ గౌరవం అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని ప్రస్తుతం మార్చురీలో ఉంచారు. అభిమానుల సందర్శనార్ధం బుధవారం రవీంద్ర సదన్‌కు ఆయన భౌతికకాయాన్ని తీసుకువెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఉత్సాద్‌.. రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన శాస్త్రీయ గాయకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్‌కు మునిమనవడు. గత నెలలో సెరిబ్రల్ అటాక్‌ సంభవించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అప్పటి నుంచి ఆయన వెంటిలేషన్‌పై ఉన్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఈ విలన్ ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో..
ఈ విలన్ ఆఖరి రోజుల్లో ఎంత నరకం అనుభవించారో..
కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.! చాక్ పీస్ పట్టి.. లెక్కల మాస్టర్‌గా..
కలెక్టర్ అంటే ఇలా ఉండాలి.! చాక్ పీస్ పట్టి.. లెక్కల మాస్టర్‌గా..
కాలుష్యంతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి.. నురగలు కక్కుతున్న యుమునా!
కాలుష్యంతో ఉత్తరాది ఉక్కిరిబిక్కిరి.. నురగలు కక్కుతున్న యుమునా!
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని..!బీఅలర్ట్
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని..!బీఅలర్ట్
మృత్యు వారదులుగా మారుతోన్న ధాన్యపు రాశులు..
మృత్యు వారదులుగా మారుతోన్న ధాన్యపు రాశులు..
సినీ ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం.. కమల్ ఆస్తులు తెలిస్తే.
సినీ ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం.. కమల్ ఆస్తులు తెలిస్తే.
దూకుడును మరింత పెంచేందుకు గులాబీ బాస్ కసరత్తు..
దూకుడును మరింత పెంచేందుకు గులాబీ బాస్ కసరత్తు..
క్షీణిస్తోన్న సునీతా విలియమ్స్‌ ఆరోగ్యం? ఆందోళన కలిగిస్తోన్న ఫొటో
క్షీణిస్తోన్న సునీతా విలియమ్స్‌ ఆరోగ్యం? ఆందోళన కలిగిస్తోన్న ఫొటో
వామ్మో.. 18 వేల నకిలీ కంపెనీలు.. రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేత!
వామ్మో.. 18 వేల నకిలీ కంపెనీలు.. రూ.25 వేల కోట్ల పన్ను ఎగవేత!
షారుఖ్ ఖాన్ ను చంపేస్తాం.. ముంబై పోలీసులకు మళ్లీ బెదిరింపు కాల్స్
షారుఖ్ ఖాన్ ను చంపేస్తాం.. ముంబై పోలీసులకు మళ్లీ బెదిరింపు కాల్స్