AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అడిగినంత డబ్బు ఇవ్వలేదనీ.. కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు! వీడియో వైరల్‌

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిపై ఓ యువకుడు దాడి చేసి కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చేతిలో దెబ్బలు తిన్న ఆ తల్లి మృతి చెందింది. తల్లిని చీరతో గొంతు చుట్టూ బిగించి చంపుతున్న వీడియో బయటికి రావడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లోని కేశంపేట్ రోడ్‌లో నివాసముండే..

Viral Video: అడిగినంత డబ్బు ఇవ్వలేదనీ.. కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు! వీడియో వైరల్‌
Woman Dies After Son Slaps
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2024 | 9:16 PM

షాద్ నగర్, జనవరి 8: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిపై ఓ యువకుడు దాడి చేసి కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చేతిలో దెబ్బలు తిన్న ఆ తల్లి మృతి చెందింది. తల్లిని చీరతో గొంతు చుట్టూ బిగించి చంపుతున్న వీడియో బయటికి రావడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లోని కేశంపేట్ రోడ్‌లో నివాసముండే సుగుణమ్మపై ఆమె కుమారుడు శివ కుమార్ ఆదివారం విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడి సమయంలో సుగుణమ్మ ధరించిన చీరను ఆమె కొడుకు మెడకు బిగించి బలంగా లాగాడు. స్థానికులు అడ్డుకొని కొడుకును పంపించి వేశారు.