Women’s index: మహిళా భద్రతకు పెద్దపీట వేసిన టాప్ 5 నగరాల్లో హైదరాబాద్‌కు చోటు.. ఢిల్లీ ఎన్నో స్థానంలో ఉందంటే

అవతార్ గ్రూప్ తాజాగా 'టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా (TCWI)' ఇండెక్స్ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. అందులో దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో మహిళా భద్రతకు పెద్దపీట వేసిన టాప్‌ 5 నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఉంది. నగరాల చారిత్రక, సామాజిక అంశాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ డేటా, ప్రాథమిక పరిశోధనలో..

Women's index: మహిళా భద్రతకు పెద్దపీట వేసిన టాప్ 5 నగరాల్లో హైదరాబాద్‌కు చోటు.. ఢిల్లీ ఎన్నో స్థానంలో ఉందంటే
Women EMPO
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2024 | 12:08 PM

హైదరాబాద్, జనవరి 5: అవతార్ గ్రూప్ తాజాగా ‘టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా (TCWI)’ ఇండెక్స్ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. అందులో దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో మహిళా భద్రతకు పెద్దపీట వేసిన టాప్‌ 5 నగరాల్లో హైదరాబాద్‌ కూడా ఉంది. నగరాల చారిత్రక, సామాజిక అంశాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పాలసీల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ డేటా, ప్రాథమిక పరిశోధనలో పాల్గొన్న 12 వందల మంది మహిళల అభిప్రాయాలు సేకరించి ఈ సూచికను రూపొందించారు. జెండర్‌ ప్రోగ్రెసివ్‌ లివింగ్‌ స్పేస్‌ పురోగతిని ఈ నివేదిక సూచిస్తుంది.

తొలి ఐదు స్థానాలు దక్కించుకున్న నగరాల్లో హైదరాబాద్‌తోపాటు చెన్నై, బెంగళూరు, పూణె, ముంబై నగరాలు ఉన్నాయి. ఇవన్నీ దక్షిణాది సిటీలు కావడం మరో విశేషం. మహిళలపై నేరాలు అత్యధికంగా నమోదయ్యే దేశ రాజధాని ఢిల్లీ మొదటి 10 నగరాల్లో ప్రవేశించి.. 8వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ గతేడాది 14వ స్థానంలో నిలిచింది. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఈ నివేదిక తెలుపుతుంది. దేశంలో 32 శాతం మంది మహిళలు సురక్షితంగా లేరని భావించగా, మరో 21 శాతం మంది రాత్రి 8 గంటల తర్వాత బయటకు వెళ్లేందుకు భయపడుతున్నట్లు వెల్లడించారు. 31 శాతం మంది మహిళలు తమ వస్త్రధారణను బట్టి ఎదుటి వారు తమను జడ్జి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరో 30 శాతం మంది మహిళలు మాత్రం మిశ్రమ అనుభవాలను తెలిపారు.

సామాజిక చేరిక స్కోరు (social inclusion score), పారిశ్రామిక చేరిక స్కోరు (industrial inclusion score), పౌర అనుభవ స్కోరు (citizen experience score) అనే మూడు ముఖ్యమైన అంశాలను ఈ సూచిక సూచిస్తుంది. ఈ కొలమానాలు బాహ్య సామాజిక వాతావరణం, సంస్థల్లో శ్రామికశక్తిని చేర్చడం, సర్వేల ద్వారా మహిళల అనుభవాలు తెలుసుకోవడం, ఫోకస్ గ్రూప్ చర్చల (FGDs) ద్వారా మహిళల అనుభవాలను అంచనా వేయడానికి ఉపయోగించబడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.