Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: పోలీసుల విచారణలో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు.. కోర్టులో లొంగిపోయిన సబ్‌ పోస్టుమాస్టర్‌?

విలాసాలకు అలవాటు పడి ప్రజాధనాన్ని సొంతానికి వాడుకున్న సబ్‌ పోస్టుమాస్టర్‌ నల్గొండలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పైలాన్‌ కాలనీలోని సబ్‌ పోస్టాఫీస్‌లో ఈ వ్యవహారం బయటపడింది. ఖాతాదారుల సొమ్ము సుమారు కోటిన్నరకుపైగానే సబ్‌ పోస్టుమాస్టర్‌ స్వాహా చేసినట్టు తాజాగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో నల్లగొండ జిల్లా హలియా మండలం హజారి గూడెంకు చెందిన నిందితుడు పేరుమళ్ల రామకృష్ణపై..

Nalgonda: పోలీసుల విచారణలో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు.. కోర్టులో లొంగిపోయిన సబ్‌ పోస్టుమాస్టర్‌?
Sub Postmaster Ramakrishna Surrendered
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 04, 2024 | 8:14 AM

నాగార్జునసాగర్‌, జనవరి 4: విలాసాలకు అలవాటు పడి ప్రజాధనాన్ని సొంతానికి వాడుకున్న సబ్‌ పోస్టుమాస్టర్‌ నల్గొండలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పైలాన్‌ కాలనీలోని సబ్‌ పోస్టాఫీస్‌లో ఈ వ్యవహారం బయటపడింది. ఖాతాదారుల సొమ్ము సుమారు కోటిన్నరకుపైగానే సబ్‌ పోస్టుమాస్టర్‌ స్వాహా చేసినట్టు తాజాగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో నల్లగొండ జిల్లా హలియా మండలం హజారి గూడెంకు చెందిన నిందితుడు పేరుమళ్ల రామకృష్ణపై ఖాతాదారులు, పోస్టల్‌ డిపార్టుమెంట్‌ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నాగార్జునసాగర్‌ సీఐ బీసన్న బుధవారం తపాలా కార్యాలయానికి వెళ్లి విచారణ చేశారు.

పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఖాతాదారులు, డిపాజిటర్లు వారి పాసుబుక్‌లతో పెద్ద సంఖ్యలో పోస్టాఫీస్‌కు వచ్చారు. సబ్‌ పోస్టుమాస్టర్‌ రామకృష్ణ పోస్టాఫీసు ఖాతాదారులకు డూప్లికేట్‌ పాసుపుస్తకాలు ఇచ్చాడని. ఖాతాదారులు ఖాతాలో వేసిన నగదును ఆ పాసుపుస్తకంలోనే రాసి ఇస్తూవచ్చాడని, వచ్చిన నగదును వచ్చినట్లు తన సొంత ఖాతాలో జమ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఖాతాదారుల ఫోన్‌ నంబర్లు కూడా మార్చి వేరే నంబర్లు నమోదు చేసినట్లు వెల్లడైంది. సబ్‌ పోస్టుమాస్టర్‌ రామకృష్ణ కాజేసిన సొమ్ములో ఖాతాదారుల అకౌంట్లలోని నగదుతోపాటు డిపాజిట్‌దారుల సొమ్మును విత్‌డ్రా చేసినట్లు తేలింది. ముందే ఖాతా నంబర్లకు లింకయిన ఫోన్‌ నంబర్లను మార్చడంతో నగదు విత్‌డ్రా చేసినా.. ఖాతాదారుల ఫోన్లకు సమాచారం వెళ్లలేదని విచారణలో తేలింది. పోస్టాఫీస్‌లో లక్షల రూపాయల సొమ్ము విత్‌డ్రా అవుతుంటే సంబంధిత ఉన్నతాధికారులు పసిగట్టలేకపోవడం గమనార్హం. గతంలో ఒక ఖాతా నుంచి చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నా.. తమకు ఫోన్‌ చేసి మీ నగదును విత్‌డ్రా చేసుకున్నారా అని ఆరా తీసేవారని, అతి తక్కవ కాలంలో ఇంత నగదు విత్‌డ్రా చేస్తుంటే అధికారులు పట్టించుకోకపోవడంపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాగా గతేడాది డిసెంబర్‌ రెండవ వారంలో సబ్‌ పోస్టుమాస్టర్‌ రామకృష్ణ చేతివాటం వ్యవహరాం వెలుగులోకి వచ్చింది. నగదు లెక్కల్లో తేడా వచ్చినట్లు గమనించిన పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారులు గత నెల 17న సస్పెండ్‌ చేశారు. దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు రామకృష్ణ శనివారం నిడమనూరు కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.