Telangana: తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్‌.. నెలాఖరులోగా అమల్లోకి మరో పథకం..

ఇదిలా ఉంటే తాజాగా మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల..

Telangana: తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్‌.. నెలాఖరులోగా అమల్లోకి మరో పథకం..
Telangana
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 04, 2024 | 9:55 AM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన రెండు గ్యారెంటీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రేవంత్‌ రెడ్డి.. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచితంగా ప్రయాణంతో పాటు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా కింద పరిమిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆర్థక శాఖతో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ పథకాన్ని ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలే అమల్లో ఉన్నాయి. దీంతో ఆ పథకాలపై అధ్యయం చేసి, ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని అధికారులకు సీఎం తెలిపారని సమాచారం. ఇప్పటికే ప్రజా పాలన పేరుతో సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమాచారాన్నంతా డేటా ఎంట్రీ చేయిస్తున్నారు.

త్వరలోనే వెరిఫికేషన్‌ పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పథకాలు అమల్లో ఉన్న వారిని పథకాల నంచి తొలగిస్తారన్న వార్తలపై సీఎం రేవంత్‌ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధిపొందుతున్న వారికి యథావిధిగా పథకాలు అమలు అవుతాయని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..