Telangana TET 2024: ఏప్రిల్‌లో టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు..! 60 వేల మంది ప్రభుత్వ టీచర్లు రాసే అవకాశం

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం రేవంత్‌ సమీక్షలో తెలంగాణ టెట్‌ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్‌ తప్పనిసరి అని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో టెట్‌ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో..

Telangana TET 2024: ఏప్రిల్‌లో టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు..! 60 వేల మంది ప్రభుత్వ టీచర్లు రాసే అవకాశం
Telangana TET
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2024 | 7:17 AM

హైదరాబాద్‌, జనవరి 3: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం రేవంత్‌ సమీక్షలో తెలంగాణ టెట్‌ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్‌ తప్పనిసరి అని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ నేపథ్యంలో టెట్‌ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరిలో 60 వేల మంది వరకు టెట్‌ పరీక్ష రాసే అవకాశం ఉంది. 2012కు ముందు టెట్‌ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. టెట్‌ అర్హత ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు కూడా టెట్‌ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి.

మరోవైపు రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇంకా 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు మరో 22 వేల ఎస్జీటీ టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్‌ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ కొలువుల్లో ఉన్న వారికి డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహించిన మాదిరి ప్రత్యేకంగా టెట్‌ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు.

కాగా ఏడాదికి రెండు సార్లు టెట్‌ చేపట్టాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నవారికి విధిగా టెట్‌ నిర్వహించాల్సి రావడంతో.. వారితోపాటు మిగతా వారికి కూడా కలిపి సాధారణ టెట్‌ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ క్రమంలో టెన్త్‌ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్‌ మొదటి వారంలో టెట్‌ చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్‌కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, కొంత సమయం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.