BIS Recruitment 2024: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో 107 కన్సల్టెంట్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఒప్పంద ప్రాతిపదికన సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితక విభాగాల్లో కన్‌సల్టెంట్ పోస్టుల భర్తీకి ఆర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 107 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఒప్పంద ప్రాతిపదికన సివిల్ ఇంజినీరింగ్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితక విభాగాల్లో కన్‌సల్టెంట్ పోస్టుల భర్తీకి ఆర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 107 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టును బట్టి టింబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ టెక్నాలజీ ఫారెస్ట్, సివిల్/ ఫైర్/ మెటలర్జి, స్ర్టక్చరల్ ఇంజినీరింగ్, కెమికల్, పాలీమర్ ఇంజినీరింగ్/ ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంటెక్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో 5 నుంచి 10 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 65 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 19, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికై వారికి ఏడాది ఒప్పంద కాలం ముగిసే వారకు నెలకు రూ.75 వేల చొప్పున జీతంగా చెల్లిస్తారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు పని గంటలు ఉంటాయి.
ఖాళీల వివరాలు..
- సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 15
- కెమికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 6
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో పోస్టుల సంఖ్య: 3
- ఎలక్ట్రోటెక్నికల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 6
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ విభాగంలో పోస్టుల సంఖ్య: 6
- మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 7
- మెడికల్ ఎక్యుప్‌మెంట్ అండ్ హస్పిటల్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 2
- మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 9
- పెట్రోలియం, కోల్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ విభాగంలో పోస్టుల సంఖ్య: 5
- ప్రొడక్షన్ అండ్ జనరల్ ఇంజినీరింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 10
- టెక్స్‌టైల్ విభాగంలో పోస్టుల సంఖ్య: 8
- ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 7
- వాటర్ రీసోర్సెస్ విభాగంలో పోస్టుల సంఖ్య: 6
- సర్వీస్ సెక్టార్ విభాగంలో పోస్టుల సంఖ్య: 8
- మేనేజ్‌మెంట్ అండ్ సిస్టమ్ విభాగంలో పోస్టుల సంఖ్య: 5
- ఆయూష్ విభాగంలో పోస్టుల సంఖ్య: 4
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.