Inter student suicide: గురుకులంలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం (జనవరి 1) ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేళ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. బాలుడి మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే....

Inter student suicide: గురుకులంలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
Inter Student Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2024 | 10:28 AM

మహబూబ్‌నగర్‌, జనవరి 2: ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకులంలో సోమవారం (జనవరి 1) ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేళ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. బాలుడి మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే..

నారాయణ పేట జిల్లా మద్దూర్‌ మండలంలోని భూనీడ్‌కు గ్రామంలో నివాసం ఉంటోన్న లక్ష్మి, హనుమంతురెడ్డి దంపతులకు ఒ క్కగానొక్క కుమారుడు రాంరెడ్డి (17). అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని మహబూబ్‌నగర్‌ మైనార్టీ గురుకుల పాఠశాల2లలో చేర్చించారు. రాంరెడ్డి అక్కడ ఇంటర్‌ సీఈసీ సెకండియర్‌ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి న్యూ ఇయర్‌ వేడుకల్లో మిత్రులతో కలిసి రాత్రి 3 గంటల వరకు సందడి చేసిన రాంరెడ్డి.. అనంతరం హాస్టల్‌ పై ఫ్లోర్‌లో ఉన్న కాలేజీ తరగతి గదికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. సోమవారం ఉదయం 9:30కు కాలేజీ నిర్వహకులు గుర్తించారు. వెంటనే రాంరెడ్డిని కిందకు దించి జిల్లా దవాఖానకు తరలించారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారితోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున కాలేజీకి తరలివచ్చారు. రాం రెడ్డికి ఎలాంటి సమస్యలు లేవని, చదువులోనూ చురుకుగా ఉండేవాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటాడని, ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని అన్నారు. తమ బిడ్డ మృతిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, రూ. 50 లక్షలు నష్టం పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. కాలేజీ ఎదుక బైఠాయింటి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ మహేశ్‌ సీఐలు ప్రవీణ్‌ కుమార్‌, సైదులు, శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రాంరెడ్డి మృతిపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిర్వహిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.