Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తాగుబోతు తండ్రి కర్కశం.. కాలుతున్న గడ్డివాములోకి కన్నబిడ్డను విసిరేసిన కసాయి

మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి తన ఏడేళ్ల కుమార్తెను కాలుతున్న గడ్డివాములోకి విసిరేశాడు. వెంటనే పొరుగు వ్యక్తి రక్షించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామంలో ఆదివారం (డిసెంబర్ 31) ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Telangana: తాగుబోతు తండ్రి కర్కశం.. కాలుతున్న గడ్డివాములోకి కన్నబిడ్డను విసిరేసిన కసాయి
Ather Threw His Daughter Into A Burning Haystack
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2024 | 8:42 AM

బీర్కూర్‌, జనవరి 1: మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి తన ఏడేళ్ల కుమార్తెను కాలుతున్న గడ్డివాములోకి విసిరేశాడు. వెంటనే పొరుగు వ్యక్తి రక్షించడంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామంలో ఆదివారం (డిసెంబర్ 31) ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన దేశాయిపేట్‌ సాయిలుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పెద్ద కుమార్తె అంకిత (7), చిన్న కుమార్తె మహిత. వీరిద్దరూ స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వారిద్దరూ తమ ఇంటి సమీప ప్రాంతంలో ఆడుకుంటున్నారు. వారి ఇంటికి కొద్ది దూరంలో దూరంలోని గొట్టల గంగాధర్‌ అనే వ్యక్తికి చెందిన గడ్డి వాములకు అగ్నిరాజుకుంది. సమారు 200 గడ్డి వాములకు మంటలు అంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గమనించేసరికే అప్పటికే అవి చాలావరకు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న యజమాని గంగాధర్‌ అక్కడికి పరుగు పరుగున వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు.

సమీపంలో ఆడుకుంటున్న సాయిలు పెద్ద కుమార్తె అంకిత తన గడ్డివాముకు నిప్పంటించిందంటూ సాయిలుతో గంగాధర్‌ వాగ్వాదానికి దిగాడు. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు గంగాధర్‌ దుర్భాషలాడాడని తీవ్ర కోపోధ్రిక్తుడయ్యాడు. దీంతో కుమార్తె అంకితను అమాంతం ఎత్తుకుని కాలుతున్న గడ్డి వాములోకి విసిరేశాడు. వెంటనే గంగాధర్‌ అప్రమత్తమై చిన్నారిని బయటకు తీసుకొచ్చి, బాలిక ప్రాణాలు కాపాడాడు. బాలిక రెండు కాళ్లు, ఎడమ చేతికి కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాలికను అంబులెన్స్‌ వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం అంకిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.