Andhra Pradesh: కొత్త ఏడాదిలో కలిసొచ్చిన అదృష్టం..!  బిర్యానీ తిన్నాడు.. రూ.7 లక్షల కారు గెల్చుకున్నాడు..

ఘుమఘుమలాడే బిర్యానీని ఇష్టపడని వారుండరు. బర్త్‌డే పార్టీలు, వివాహ వేడుకలు, పండగలు విశేషమేదైనా విందులో బిర్యానీ ఉండాల్సిందే. తాజాగా ఓ వ్యక్తి హోటల్‌లో బిర్యానీ లాగించాడు. అనంతరం ఖరీదైన గిఫ్ట్‌ గెల్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తిరుపతిలోని రోబో హోటల్‌ గత సెప్టెంబర్ నెలలో వినూత్న కార్యక్రమాన్ని..

Andhra Pradesh: కొత్త ఏడాదిలో కలిసొచ్చిన అదృష్టం..!  బిర్యానీ తిన్నాడు.. రూ.7 లక్షల కారు గెల్చుకున్నాడు..
Lucky Draw
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2024 | 7:11 AM

తిరుపతి, జనవరి 1: ఘుమఘుమలాడే బిర్యానీని ఇష్టపడని వారుండరు. బర్త్‌డే పార్టీలు, వివాహ వేడుకలు, పండగలు విశేషమేదైనా విందులో బిర్యానీ ఉండాల్సిందే. తాజాగా ఓ వ్యక్తి హోటల్‌లో బిర్యానీ లాగించాడు. అనంతరం ఖరీదైన గిఫ్ట్‌ గెల్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తిరుపతిలోని రోబో హోటల్‌ గత సెప్టెంబర్ నెలలో వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. హోటల్‌లో బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా కూపన్ అందజేసింది. దీంతో హోటల్‌కి వచ్చిన వారందరికీ కూపన్లు అందజేయడంతో సుమారు 23 వేలకు పైగా కూపన్లు చేరాయి.

జనవరి 1 నూతన ఏడాదిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, ఆయన భార్య నీలిమ హోటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో లక్కీ డ్రా కండక్ట్‌ చేశారు. ఇందులో తిరుపతికి చెందిన రాహుల్ విజేతగా నిలిచారు. ఆయనకు దాదాపు ఏడు లక్షల రూపాయల విలువైన నిస్సాన్ మ్యాగ్నెట్ కారును ఉచితంగా అందజేశారు. ఈ విషయాన్ని హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం రాహుల్‌ను పిలిపించి ఆయనకు కారును అందజేశారు. ఈ కార్యక్రమంలో రోబో హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తిరుపతి నగర వాసులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న స్కీం ప్రవేశపెట్టాం. తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు రోబో హోటల్లో అందిస్తున్నాము. ఇలాంటి వినూత్న స్కీములు భవిష్యత్తులో మరిన్ని కొనసాగిస్తామని’ భరత్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!