Love Marriage: కూతురిపై ఓ తండ్రి ప్రేమ అల్లుడి ప్రాణాలను బలికొంది.. హత్యకు కారణం ఇదే..

ప్రేమించి పెళ్లి చేసుకుని తన కూతురితో వెట్టి చాకిరి చేయిస్తున్నావేంటి అని అల్లుడిని మామ ప్రశ్నించారు. అప్పుడు చిన్నపాటి గొడవ జరిగి అది కాస్త బంధువుల జోక్యంతో పెద్దదైంది. చివరకు అల్లుడి హత్యకు దారితీసింది. ఈ ఘటనలో 9 మందిని అరెస్టు చేశారు పోలీసులు. తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన వాసు, నాలుగు సంవత్సరాల క్రితం వెన్నెల అనే యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

Love Marriage: కూతురిపై ఓ తండ్రి ప్రేమ అల్లుడి ప్రాణాలను బలికొంది.. హత్యకు కారణం ఇదే..
Murder In Tenali
Follow us

| Edited By: Srikar T

Updated on: Dec 31, 2023 | 10:54 PM

ప్రేమించి పెళ్లి చేసుకుని తన కూతురితో వెట్టి చాకిరి చేయిస్తున్నావేంటి అని అల్లుడిని మామ ప్రశ్నించారు. అప్పుడు చిన్నపాటి గొడవ జరిగి అది కాస్త బంధువుల జోక్యంతో పెద్దదైంది. చివరకు అల్లుడి హత్యకు దారితీసింది. ఈ ఘటనలో 9 మందిని అరెస్టు చేశారు పోలీసులు. తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన వాసు, నాలుగు సంవత్సరాల క్రితం వెన్నెల అనే యువతని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వాసు తల్లికి ఐదు నెలల కిందట పక్షవాతం వచ్చింది. ఇంట్లో పనులతో పాటు వాసు తల్లి యోగక్షేమాలు కూడా వెన్నెలే దగ్గరుండి చూసుకుంటున్నారు. కఠెవరంలో తన కూతురిని చూసేందుకు వెన్నెల తండ్రి అబ్రహంతో పాటు ఆమె బాబాయి ఈనెల 25వ తేదీన వచ్చారు. ఆ సమయంలో వెన్నెల చేస్తున్న వెట్టి చాకిరి చూసి ఆవేదనతో తండ్రి అబ్రహం.. అల్లుడు వాసుతో గొడవపడ్డాడు. దీంతో కోపానికి గురైన అల్లుడు, తన మామని చిన్నమామని ఇద్దరినీ తిట్టి ఇంటి నుండి నెట్టివేశాడు. దీంతో మనస్థాపానికి గురైన వీరు కఠెవరంలో ఉంటున్న వీరి బంధువులైన మేరీకి చెప్పి బాధపడి తమ గ్రామానికి వెళ్ళిపోయారు.

ఈ విషయాన్ని మేరీ.. తన భర్త, ఇద్దరు కుమారులకు చెప్పగా కోపానికి గురైన వీరు గ్రామంలోని మరి కొంతమందితో కలిసి వెళ్లి అల్లుడు వాసు పై కర్రలతో దాడి చేశారు. అంతలో వాసు తమ్ముడు గోపి అడ్డురాగా గోపిపై కూడా దాడి చేశారు. ఇంతలో ఆ ప్రాంతం నుండి వాసు పారిపోయాడు. అయితే ఎలాగైనా వాసుని చంపి వెన్నెలకు వెట్టి చాకిరి నుండి విముక్తి కలిగించాలని అల్లడు వాసు కోసం గాలించారు. అదేరోజు రాత్రి 11 గంటలకు వాసు ఇంటికి రాగా, అందరూ కలిసి మరోసారి వాసుపై దాడి చేశారు. జరుగుతున్న విషయాన్ని వాసు తమ్ముడు, వాసు మేనమామ అయిన తిరుపతి రావుకు చెప్పగా, గొడవ జరుగుతున్న ప్రాంతంలో వాసును కాపాడేందుకు వచ్చిన తిరుపతిరావుపై కూడా కర్రతో బలంగా కొట్టి గాయపరిచారు. ముందుగా తమతోపాటు తెచ్చుకున్న కత్తితో వాసు మీద దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో వాసు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా వాసు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు ఈ హత్యపై దర్యాప్తు జరిపి 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు