AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2024: న్యూ ఇయర్ వేళ విశాఖ వాసులకు అలెర్ట్.. ఆర్కే బీచ్ సహా ఆ రోడ్లలో వాహనాలు నో ఏంట్రీ.. పోలీస్ ఆంక్షలు ఇవే..

తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై ఈరోజు రాత్రి వాహనాలు రాకపోకలు నిషేధం విధించ్చారు. రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేస్తారు. అదే సమయాల్లో హనుమంతువాక - అడవి వరం బి ఆర్ టి ఎస్ రోడ్, గోశాల - వేపగుంట జంక్షన్, పెందుర్తి నుంచి కాన్వెంట్ జంక్షన్ వయా ఎన్ఏడి రోడ్లలో మిడిల్ రోడ్ ముసివేస్తామని పోలీసులు ప్రకటించ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

New Year 2024: న్యూ ఇయర్ వేళ విశాఖ వాసులకు అలెర్ట్.. ఆర్కే బీచ్ సహా ఆ రోడ్లలో వాహనాలు నో ఏంట్రీ.. పోలీస్ ఆంక్షలు ఇవే..
Visakha New Year Eve
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Dec 31, 2023 | 12:48 PM

న్యూ ఇయర్ వేడుకల నేపధ్యంలో అప్రమత్తమయ్యారు విశాఖ పోలీసులు. కీలక ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి రేపు తెల్లవారు జాము 5 గంటల వరకు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఆర్కే బీచ్ రోడ్ లో రాత్రి 8 గంటల నుంచి రేపు తెల్లవారు జాము 5 గంటల వరకు వాహనాలకు అనుమతించమని ప్రకటించారు. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

మరోవైపు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై ఈరోజు రాత్రి వాహనాలు రాకపోకలు నిషేధం విధించ్చారు. రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేస్తారు. అదే సమయాల్లో హనుమంతువాక – అడవి వరం బి ఆర్ టి ఎస్ రోడ్, గోశాల – వేపగుంట జంక్షన్, పెందుర్తి నుంచి కాన్వెంట్ జంక్షన్ వయా ఎన్ఏడి రోడ్లలో మిడిల్ రోడ్ ముసివేస్తామని పోలీసులు ప్రకటించ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఆకతాయిలపై బాడీ వార్న్ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. హై స్పీడ్, జిగ్ జాగ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

వాటిపై స్పెషల్ ఫోకస్..

బీచ్ రోడ్ సహా పబ్స్, బార్ల పై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నామని చెప్పారు సిపి రవిశంకర్ అయ్యనార్ . ఆయా ప్రాంతాల్లో మఫ్టీలో పోలీస్ సిబ్బంది పెట్టి మానిటరింగ్ చేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందని చెప్పిన సీపీ.. ఇప్పటికే ప్రైవేట్ బార్లు హోటళ్లు పబ్బులో యాజమానులకు ప్రత్యేక సూచనలు ఇచ్చామన్నారు. నిబంధనల ప్రకారమే వేడుకలకు అనుమతులు ఇస్తామని.. పాటించని వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్ కు  అనుమతినిచ్చారు.  నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలపై 112 హెల్ప్ లైన్, 9493336633 నెంబర్ల కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
స్వీడన్‌ వీథుల్లో సామూహిక కాల్పులు.. ముగ్గురు మృతి! వీడియో చూశారా
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది తిని చూడండి..!
ట్రంప్‌ జోక్స్‌తో బిత్తరపోయిన వాటికన్‌..! నేనే కొత్త పోప్‌ అంటూ
ట్రంప్‌ జోక్స్‌తో బిత్తరపోయిన వాటికన్‌..! నేనే కొత్త పోప్‌ అంటూ
పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
13 ఏళ్లకే టాలీవుడ్ లవర్ బాయ్.. తెలుగు హీరో హరీష్ గుర్తున్నాడా.. ?
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే, మరో జన్మ ఎత్తాల్సిందే
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
రాక్ సాల్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా..?
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!
ఇవి తింటే కడుపులో ఉన్న చెత్తంతా బయటికి పోతుంది..!
సింహాచలం ఘటన దురదృష్టకరం.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ దిగ్ర్బాంతి..
సింహాచలం ఘటన దురదృష్టకరం.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ దిగ్ర్బాంతి..
వ్యాక్సిన్ ఏ చేతికి వేసుకుంటే ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది.. ?
వ్యాక్సిన్ ఏ చేతికి వేసుకుంటే ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది.. ?