Andhra Pradesh: ఎందుకమ్మా ఇలా చేశావ్.. భర్త మీద కోపంతో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆ తర్వాత..

కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్విలో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటిలో ఆర్లబండ దేవరకు భర్త పంపలేదని గోద్రేజ్ హైర్ కలర్ ను నీటిలో కలిపి ఇద్దరు చిన్నారులకు తాగించింది. అనంతరం తాను తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది తల్లి శారదమ్మ. తల్లి ఇద్దరు చిన్నారులు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆసుపత్రిలో తల్లి శారదమ్మ కోలుకుంటుంది.

Andhra Pradesh: ఎందుకమ్మా ఇలా చేశావ్.. భర్త మీద కోపంతో పిల్లలకు విషమిచ్చిన తల్లి.. ఆ తర్వాత..
Andhra Pradesh
Follow us

| Edited By: Surya Kala

Updated on: Dec 31, 2023 | 12:05 PM

కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన శారదమ్మ ను నాలుగున్నర సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో హాల్వీ గ్రామానికి చెందిన రామకృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. అర్ల బండ దేవర కోసం వెళ్లాలని భర్తను పదేపదే బాధించింది. భర్త పొలం పనులు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో పండుకున్నాడు.. అంతలోపే ఆ తల్లి మనస్థాపం చెంది ఆ పిల్లలను బకెట్లో ముంచి చంపేసింది. తాను కూడా పిల్లలతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకొని విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది.

కౌతాళం మండలం హాల్వి గ్రామంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి బకెట్లో ముంచేసింది తల్లి. ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం తాను కూడా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. శారదమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అల్లారి ముద్దుగా ఆడుతున్న పిల్లలు అకస్మాత్తుగా మరణించడంతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకుంటున్నారు . నూరేళ్లు నిండకముందే తన పిల్లల జీవితాలను చితిమేసింది ఆ కసాయి తల్లి. పిల్లల కోసం చాలామంది గుడి గోపురాలకు రాళ్లకు గుట్టలకు పూజలు చేస్తుంటారు. అలాంటిది మరిచి ఆ పసి కందులను ఎలా చంపాలని నిర్ణయించుకుందో ఆ భగవంతునికే తెలుసు. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్విలో దారుణం చోటు చేసుకుంది. పుట్టింటిలో ఆర్లబండ దేవరకు భర్త పంపలేదని గోద్రేజ్ హైర్ కలర్ ను నీటిలో కలిపి ఇద్దరు చిన్నారులకు తాగించింది. అనంతరం తాను తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడింది తల్లి శారదమ్మ .

ఇవి కూడా చదవండి

తల్లి ఇద్దరు చిన్నారులు ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆసుపత్రిలో తల్లి శారదమ్మ కోలుకుంటుంది. అయితే ఇంతటి దారుణానికి కారణం భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలే అంటున్నారు స్థానికులు. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వెంకి (3) ఏళ్ళు కాగా భరత్ (06) నెలలు. ఇద్దరు చిన్నారులు తల్లి చేతిలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆసుపత్రిలో చుక్కలు చూపించిన ఆకుపచ్చ పాము..!
ఆసుపత్రిలో చుక్కలు చూపించిన ఆకుపచ్చ పాము..!
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
గుజరాత్‌లో రథయాత్రకు జగన్నాథుడు రెడీ జూలై 7న అన్న చెల్లితో విహారం
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
ఈమె లేనిదే అందానికి విలువ లేదేమో.. మానుషి సిజ్లింగ్ ఫొటొలు షేర్..
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
నిండా నాలుగు నెలలు లేవు.. అప్పడే ఏ ఫర్‌ యాపిల్‌ అంటోంది.!
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
వెన్నలకు మరో రూపంలా మెరిసిపోతున్న ఐశ్వర్య .. తాజా ఫోటోలు వైరల్..
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
దేశంలో అత్యధిక జీతం తీసుకుంటున్న సీఎం ఎవరో తెలుసా?
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం..
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం తాగినా..!
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నిర్జల ఏకాదశి రోజున ఈ చర్యలు చేస్తే చాలు.. డబ్బుకు ఎప్పటికీ కొరత
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..
నరరూప రాక్షసుడిలా దర్శన్.. రేణుకస్వామి పోస్ట్‏మార్టమ్ రిపోర్ట్..